Share News

Indian-origin Sai Varshit Kandula :బైడెన్‌ను చంపేద్దామనుకున్నా!

ABN , Publish Date - May 15 , 2024 | 03:57 AM

అమెరికా ప్రభుత్వాన్ని కూలదోసి, నాజీ ప్రభుత్వాన్ని నెలకొల్పే ఉద్దేశంతో వైట్‌హౌ్‌సపై దాడికి పాల్పడినట్లు భారత సంతతికి చెందిన సాయి వర్షిత్‌ కందుల(20) అంగీకరించాడు.

Indian-origin Sai Varshit Kandula :బైడెన్‌ను చంపేద్దామనుకున్నా!

వైట్‌హౌ్‌సపై ట్రక్కుతో దాడి కేసులో

సాయి వర్షిత్‌ నేరాంగీకారం

వాషింగ్టన్‌, మే 14: అమెరికా ప్రభుత్వాన్ని కూలదోసి, నాజీ ప్రభుత్వాన్ని నెలకొల్పే ఉద్దేశంతో వైట్‌హౌ్‌సపై దాడికి పాల్పడినట్లు భారత సంతతికి చెందిన సాయి వర్షిత్‌ కందుల(20) అంగీకరించాడు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైతే అధ్యక్షుడు జో బైడెన్‌ను చంపడానికి కూడా సిద్ధపడినట్లు విచారణలో వెల్లడించాడు. నిందితుడిని యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టులో హాజరుపరిచిన నేపథ్యంలో అమెరికా అటార్నీ ఈ మేరకు ప్రకటన చేసింది. కోర్టు పత్రాల ప్రకారం... అమెరికాలో శాశ్వత నివాసం పొందిన భారత సంతతి కుటుంబానికి చెందిన సాయి వర్షిత్‌ మిస్సోరీలోని సెయింట్‌ లూయి్‌సలో నివసించేవాడు. గతేడాది మే 22న వాషింగ్టన్‌కు వెళ్లిన సాయి వర్షిత్‌.. అక్కడ ట్రక్కును అద్దెకు తీసుకున్నాడు. రాత్రి 9.35 గంటల ప్రాంతంలో వైట్‌హౌస్‌ వద్దకు చేరుకొని అక్కడ భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను వాహనంతో ఢీకొట్టాడు. ఆ తర్వాత ట్రక్కు దిగి నాజీ జెండాను పట్టుకొని నినాదాలు చేస్తున్న అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో సాయి వర్షిత్‌కు శిక్షను యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్టు జడ్జి ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - May 15 , 2024 | 04:38 AM