Central Cabinet Meeting : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ABN , Publish Date - Mar 19 , 2025 | 04:48 PM
Central Cabinet Meeting : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగని కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈశాన్య రాష్ట్రమైన అసోంలో అమ్మెనియా ఫ్యాక్టరీని నిర్మించాలని నిర్ణయించింది. అలాగే మహారాష్ట్రలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మించాలని కీలక నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ, మార్చి 19: యూపీఐ లావాదేవీలు రూ. 210 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్ర ఐటీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రూ. 2 వేలు కంటే తక్కువ విలువ కలిగిన లావాదేవీలకు ఎలాంటి ఛార్జీ లేదని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుత యూపీఐ విధానంలో కస్టమర్ బ్యాంక్, ఫిన్‌టెక్ సంస్థ, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్, యాప్ సంస్థ ద్వారా 4 అంచెల్లో లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. తద్వారా లావాదేవీల్లో చార్జీలను భరించాల్సి వస్తోందని పేర్కొన్నారు. రూ.1,500 కోట్లు ఇన్సెంటివ్ రూపంలో చిన్న లావాదేవీలకు చార్జి లేకుండా చేస్తున్నామన్నారు. బుధవారం న్యూఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశం ముగిసిన అనంతరం ఈ కేబినెట్‌లో తీసుకున్న పలు నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వివరించారు.
అలాగే ఈశాన్య రాష్ట్రమైన అసోంలోని నామ్‌రూప్ వద్ద రూ.10, 601 కోట్లతో అమ్మోనియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే బ్రహ్మపుత్రా వ్యాలీ ఫెర్టిలైజర్ ప్లాంట్‌లో అమ్మోనియా - యూరియా ఉత్పత్తి చేపడతామన్నారు. ఈశాన్య ప్రాంతంలో రైతులకు సకాలంలో ఎరువుల లభ్యత కోసం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టినట్లు వివరించారు. ఈ ప్రాజెకట్్ 48 నెలల్లో పూర్తి కానుందని స్పష్టం చేశారు.
అలాగే పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు దేశీయ పశువుల జాతుల ఉత్పాదకతను పెంపొందించడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ కోస్ం రూ. 3,400 కోట్లు కేటాయించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా పాడి రైతుల మద్దతు ఇవ్వడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా పాల అభివృద్ధి కార్యక్రమం కోసం రూ.2,790 కోట్లను కేటాయించినట్లు చెప్పారు.
మరోవైపు మహారాష్ట్రలో రూ.4,500. 62 కోట్లతో 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మించాలని ఈ కేబినెట్ భేటీలో నిర్ణయించినట్లు వెల్లడించారు. ఇది JNPA Port (పగోటే) నుంచి చౌక్ వరకు బీఓటీ పద్ధతిలో నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. ఇక ఈ రహదారి సరకు రవాణాలో ఎంతో ప్రయోజనకార ప్రాజెక్టుగా మారనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. అలాగే ఈ హైవే JNPA పోర్ట్, నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్‌వేతోపాటు NH-66 (ముంబై-గోవా హైవే) మధ్య ఈ కనెక్టివిటీని అందిస్తుందని వివరించారు. ఈ ప్రాజెక్ట్ సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచుతుందని, అలాగే ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుందని చెప్పారు. ముంబై-పుణే ప్రాంతీయ అభివృద్ధిని ఈ హైవే పెంచుతుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ భావిస్తున్నామన్నారు.
ఇవి కూడా చదవండి..
Good News For AP People: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
KGBV: కేజీవీబీ ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం.. ఎప్పటి నుంచంటే..
Central Cabinet Meeting : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
Reduce Obesity Tips: ఊబకాయాన్ని తగ్గించుకోనేందుకు.. జస్ట్ ఈ చిట్కాలు..
Summer Tips: వేసవిలో.. ఉదయం వీటిని టిఫిన్‌గా తీసుకోండి.. అదిరిపోద్ది
For National News And Telugu News