Supreme Court on Ration Card: రేషన్ కార్డులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ABN , Publish Date - Mar 19 , 2025 | 05:39 PM
పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకే రాష్ట్రాలు రేషన్ కార్డుల లెక్కలు చెబుతున్నాయని.. వాస్తవానికి మాత్రం పేదలకు రేషన్ ఫలాలు అందడం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హులే ఎక్కువగా బీపీఎల్ ..

న్యూఢిల్లీ, మార్చి 19: రేషన్ కార్డుల అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రేషన్ కార్డు పాపులారిటీ కార్డుగా మారిందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అర్హులకు రేషన్ కార్డులు అందడం లేదని సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పే రాష్ట్రాలు కూడా బీపీఎల్ కుటుంబాలు ఎక్కువ ఉన్నాయని చెబుతాయని ధర్మాసనం పేర్కొంది. పేదలకు న్యాయం చేస్తున్నామని చెప్పుకునేందుకే రాష్ట్రాలు రేషన్ కార్డుల లెక్కలు చెబుతున్నాయని.. వాస్తవానికి మాత్రం పేదలకు రేషన్ ఫలాలు అందడం లేదని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనర్హులే ఎక్కువగా బీపీఎల్ ప్రయోజనాలు పొందుతున్నారని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల రేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.