Share News

Maharashtra: గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్, నలుగురు నక్సల్స్ హతం

ABN , Publish Date - Oct 21 , 2024 | 06:34 PM

గడ్చిరోలి పోలీస్‌ సీ60 కమెండో టీమ్, సీఆర్‌పీఎఫ్ బృందం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. కొప్రి అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నట్టు పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో సుమారు 60 మంది పోలీసు బలగాలు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.

Maharashtra: గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్, నలుగురు నక్సల్స్ హతం

గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా (Gadchiroli)లో సోమవారంనాడు ఎన్‌కౌంటర్ (Encounter) చోటుసుకుంది. పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగు నక్సలైట్లు హతమయ్యారు. ఒక పోలీసు గాయపడ్డాడు. భమ్రాగఢ్ తహసిల్‌లోని కొప్రి అడవుల్లో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్టు అధికారులు తెలిపారు. గడ్చిరోలి పోలీస్‌ సీ60 కమెండో టీమ్, సీఆర్‌పీఎఫ్ బృందం సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. కొప్రి అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నట్టు పోలీసులకు ఇంటెలిజెన్స్ సమాచారం రావడంతో సుమారు 60 మంది పోలీసు బలగాలు ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

India-China: సరిహద్దుల వివాదంలో కీలక పురోగతి.. భారత్-చైనా మధ్య ఒప్పందం


లొంగిపోయిన నక్సల్స్ జంట

కాగా, గడ్చిరోలి జిల్లాలో నక్సలైట్ల జంట లొంగిపోయినట్టు అధికారులు తెలిపారు. వీరిపై రూ.8 లక్షల రివార్డు కూడా ఉంది. లొంగిపోయిన నక్సలైట్లను ఆసిన్ రాజారామ్ కుమార్ (37) అలియాస్ అనిల్, అతని భర్య అంజు (28) అలియాస్ సోనియాగా గుర్తించారు. అనిల్ ఒడిశాలో మావోయిస్ట్ ప్రెస్ టీమ్ ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. హర్యానాకు చెందిన ఆయన నకిలీ ఐడెంటిటీతో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా సమీపంలో ఉంటున్నాడు. ఇదే ప్రెస్ టీమ్ సభ్యురాలిగా ఉన్న జలే కూడా హిమాచల్‌లోనే ఉంటోంది. వీరిద్దరూ సీఆర్‌పీఎఫ్ అధికారుల సమక్షంలో గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

CJI: అయోధ్య వివాద పరిష్కారం కోసం దేవుడ్ని ప్రార్థించా.. జస్టిస్ చంద్రచూడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Oct 21 , 2024 | 06:34 PM