NIA: కశ్మీర్లో భారీ ఎన్కౌంటర్.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా ఇద్దరి హతం
ABN , Publish Date - May 09 , 2024 | 09:35 AM
కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు టెర్రరిస్టులకు(Terrorists) మధ్య భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
ఢిల్లీ: కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు టెర్రరిస్టులకు(Terrorists) మధ్య భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.
దక్షిణ కశ్మీర్ కుల్గామ్‌లోని రెడ్వానీ పయీన్ ప్రాంతంలో సోమవారం అర్థరాత్రి భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆపరేషన్ మంగళవారం రాత్రి వరకు కొనసాగింది. ఈ క్రమంలో భద్రతబలగాలకు ముగ్గురు ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. దీంతో ఇరు వర్గాలకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
వాంటెడ్ టెర్రరిస్ట్ బాసిత్ అహ్మద్ దార్, లష్కరే తోయిబాకి చెందిన మోమిన్ గుల్జార్, ఫహీమ్ అహ్మద్ బాబా మృతులుగా గుర్తించారు. వీరంతా 18 మందిని హత్య చేశారని.. అలాంటి దుర్మార్గులను ఎన్ కౌంటర్ చేయడం తమకు పెద్ద విజయమని భద్రతా బలగాలు చెప్పాయి. మే 4న పూంచ్ జిల్లాలో భద్రత బలగాలను లక్ష్యంగా చేసుకున్న దాడుల్లో భారత వైమానిక దళ అధికారి మరణించారు.
IIT: చరిత్ర సృష్టించిన ఐఐటీ మద్రాస్.. ఏకంగా రూ.513 కోట్ల విరాళాలు
మరో నలుగురు గాయపడ్డారు. దీంతో ఆ ప్రాంతంపై భద్రతా బలగాలు గట్టి నిఘా ఉంచాయి. ఆ దాడుల్లో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదుల ఫొటోలను బుధవారం విడుదల చేశారు. వారిలో పాకిస్థాన్ ఆర్మీ మాజీ కమాండో ఇలియాస్, ఉగ్రవాది హడూన్ అలియాస్ హుడూన్, లష్కరే తోయిబా కమాండర్ అబు హమ్జాగా గుర్తించారు. ప్రస్తుతం వీరిని కనిపెట్టే పనిలో ఉన్నట్లు వివరించారు.
Read Latest News and National News click here..