Yatnal: కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరేది లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:17 PM
‘కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరే ప్రసక్తే లేదు.. గౌరవంగా పిలిస్తే బీజేపీలోకి వెళ్తా’నని బీజేపీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటుకు గురైన బసనగౌడపాటిల్ యత్నాళ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి నేత అని అన్నారు.

- దసరా లోపు తుది నిర్ణయం: యత్నాళ్
బెంగళూరు: బీజేపీ నుంచి ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటుకు గురైన బసనగౌడపాటిల్ యత్నాళ్(Basanagowda Patil Yatnal) బెంగళూరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలలో చేరేది లేదని తేల్చిచెప్పారు. బీజేపీలో వంశపారంపర్యం పెరిగిందని, యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర ఆగడాలను ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. కాంగ్రెస్, జేడీఎస్(Congress, JDS) పార్టీల్లో చేరే ఆలోచన లేదన్నారు. నా భవిష్యత్తు నిర్ణయాన్ని దసరావేళ ప్రకటిస్తానన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Lion: జూలో మగ సింహం మృతి
యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు శివమొగ్గలో మతఘర్షణలు జరిగితే హిందువులకు మద్దతు ఇవ్వలేదన్నారు. కానీ ఆయన కొడుకు ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడన్నారు. హిందువులకు వాళ్లు ఎప్పుడూ మద్దతుగా నిలబడలేదన్నారు. వారి కుటుంబ అక్రమాలపై నిలదీస్తున్నందుకే తనపై కుట్ర పన్ని సస్పెన్షన్ వేటు వేయించారన్నారు. మళ్లీ బీజేపీలో చేరేందుకు ఎవరినీ బతిమాలేది లేదన్నారు. నేను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. పార్టీకి నిష్టావంతుడిని మాత్రమే అన్నారు. క్షమాపణలు కోరినా చెప్పే ప్రసక్తే లేదన్నారు. వాజ్‌పేయ్, ఎల్‌కే అడ్వాణి వంటి నాయకుల మద్దతుతో ఎదిగానన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంచి నేత అని, అయితే ఆయన చుట్టూఉన్నవారు కిందిస్థాయిలోనివారు తీసుకునే నిర్ణయాలు సమంజసంగా లేవన్నారు. రెబెల్స్‌గా మారిన మేమంతా సమైక్యంగా ఉన్నామని, కొందరు ఎంపీలు కూడా తమకు మద్దతు ఇస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు 75శాతం రాష్ట్రనాయకత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. యడియూరప్ప కుటుంబీకులు పార్టీని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో యడియూరప్ప కొత్త రాజకీయ పార్టీ పెట్టినా మేం బీజేపీ వెంటే నడిచామన్నారు. గౌరవంగా బీజేపీ లోకి రావాలని కోరితే కొనసాగుతానన్నారు. విజయదశమి దాకా వేచి చూస్తానన్నారు.
కాగా.. కలబురగిలో యత్నాళ్ అభిమానులు ఆందోళన చేశారు. యత్నాళ్ సొంత జిల్లా విజయపుర జిల్లా బీజేపీ అధ్యక్షుడు గురులింగప్ప అంగడి యత్నాళ్‌పై మండిపడ్డారు. రానున్న తాలూకా, జిల్లా పంచాయతీ ఎన్నికల విషయమై పార్టీ జిల్లా కోర్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడతామని కోర్ కమిటీ సమావేశంలోనూ తీర్మానించామని వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
టెన్త్ జవాబు పత్రాల తరలింపులో నిర్లక్ష్యం
జములమ్మకు గద్వాల సంస్థానాధీశుల వారసుడి పూజలు
కిలాడీ లేడీ అరెస్టు.. బయటపడ్డ ఘోరాలు..
Read Latest Telangana News and National News