Share News

CBSE Revamps Syllabus: 10, 12 తరగతులకు సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:57 AM

సీబీఎస్ఈ 2025-26 విద్యా సంవత్సరానికి 10వ, 12వ తరగతులకు కొత్త సిలబస్‌ను ప్రకటించింది. 10వ తరగతి విద్యార్థులకు రెండు సార్లు పరీక్షలు రాయడంపై నిర్ణయం, 12వ తరగతికి 9 పాయింట్ల గ్రేడ్ విధానం అమలు చేయబడతాయి

CBSE Revamps Syllabus: 10, 12 తరగతులకు సీబీఎస్‌ఈ కొత్త సిలబస్‌

న్యూఢిల్లీ, మార్చి 29: పాఠ్యాంశాలు, పరీక్షల విధానంలో భారీగా మార్పులు చేసినట్టు సీబీఎ్‌సఈ ప్రకటించింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 10, 12 తరగతులకు కొత్త సిలబ్‌సను ముద్రించినట్టు తెలిపింది. పదో తరగతి విద్యార్థులు ఫిబ్రవరి, ఏప్రిల్‌లో రెండు సార్లు పరీక్షలు రాసే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది. 12వ తరగతి విద్యార్థులకు మాత్రం ఏటా ఒక్కసారే పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. 2026 ఫిబ్రవరి 17న బోర్డు ఎగ్జామ్స్‌ రాయాల్సి ఉంటుందని పేర్కొంది. పదో తరగతి విద్యార్థులు 80 మార్కులకు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మిగిలిన 20 మార్కులు అంతర్గత మదింపునకు కేటాయిస్తారు. ప్రతి పరీక్షలో కనీసం 33 మార్కులు సంపాదించాల్సి ఉంటుంది. మార్కులకు బదులుగా 9 పాయింట్ల గ్రేడ్‌ విధానాన్ని అమలు చేస్తారు. 12వ తరగతిలోనూ 9పాయింట్ల గ్రేడ్‌ విధానం అమలవుతుంది. నైపుణ్యాలకు సంబంధించిన ఎలక్టివ్‌ సబ్జెక్టులను తీసుకోవాల్సి ఉంటుంది.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం..

Minister Ramanaidu: ఏపీని ధ్వంసం చేశారు.. జగన్‌పై మంత్రి రామానాయుడు ఫైర్

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. కొత్త తరహా మోసం

For More AP News and Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:57 AM