Ashwini Vaishnaw: రైల్వే ట్రాక్ విధ్వంసం కుట్రలపై అప్రమత్తంగా ఉన్నాం
ABN , Publish Date - Sep 24 , 2024 | 08:25 PM
రైల్వే ట్రాక్ విధ్వంసానికి పాల్పడే దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
జైపూర్: ఇటీవల కాలంలో రైల్వే ట్రాక్‌లపై ఎల్పీజీ సిలెండర్లు, ఇనుపరాడ్లు పెట్టి రైలు పట్టేలు తప్పేలా జరుగుతున్న కుట్రల ఘటనలపై రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఇలాంటి ఘటనలపై తాము అప్రమత్తంగా ఉన్నట్టు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) తెలిపారు. రైల్వే ట్రాక్ విధ్వంసానికి పాల్పడే దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని జైపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
''ఇలాంటి ఘటనలపై రైల్వే శాఖ అప్రమత్తంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు, డీజీపీలు, హోం శాఖ కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నాం. ఎన్ఐఏ కూడా భాగస్వామ్యమైంది. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం'' అని అశ్విని వైష్ణవ్ తెలిపారు. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్)తో పాటు స్థానిక పోలీస్ స్టేషన్లతో అన్ని రైల్వే జోన్ల అధికారులు కలిసి పనిచేస్తున్నారని చెప్పారు. ఎన్ఐఏ పాత్ర గురించి మంత్రి మరింత వివరణ ఇవ్వలేదు.
Yogi Adityanath: ఆహారంలో కల్తీ ఘటనలను సహించం.. యోగి వార్నింగ్
వరుస ఘటనలు
రైలు పట్టాలపై గ్యాస్ సిలెండర్లు, ఇనుప రాడ్లు, సిమెంట్ ఇటుకలు వంటి వస్తువులు కనిపించిన పలు ఘటనలు ఇటీవల కాలంలో చోటుచేసుకున్నాయి. సెప్టెంబర్ 22న గూడ్సు రైలు ప్రయాగ్‌రాజ్ నుంచి కాన్పూర్ వెళ్తుండగా పట్టాలపై గ్యాస్ సిలెండర్ కనిపించడంతో డ్రైవరు ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇదే తరహా ఘటన సెప్టెంబర్ 15న జరిగింది. కాళింది ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లో ఆగడానికి కొద్ది నిమిషాల ముందు పట్టాలపై డ్యామేజ్ అయిన సిలెండర్, ఇతర వస్తువులు ఉండటాన్ని కనుగొన్నారు. సెప్టెంబర్ 21న ఉత్తరప్రదేశ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఫిష్ ప్లేట్లను ఓపెన్ చేసి పారిపోయారు. కీమెన్ అప్రమత్తం చేయడంతో రైళ్ల రాకపోకలను కొద్దిసేపు నిలిపేశారు. పట్టాలు తప్పేందుకు కుట్ర పన్నారనే ఆరోపణపై గత మంగళవారంనాడు ముగ్గురు రైల్వే ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసారు. మరో ఘటనలో ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో భటిండా-ఢిల్లీ మార్గంలోని రైలు పట్టాలపై తొమ్మిది ఇనుప రాడ్లు కనిపించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.
Read More National News and Latest Telugu News
ఇవి కూడా చదవండి:
NIA: యువతను జిహాద్‌కు సిద్ధం చేస్తున్న సంస్థపై కేసు..11 చోట్ల ఎన్ఐఏ దాడులు
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..