Share News

Chennai: అనారోగ్యంతో ఉన్న విద్యార్థినికి

ABN , Publish Date - May 03 , 2024 | 05:30 AM

అనారోగ్యంతో బాధపడుతూ ‘నీట్‌’ పరీక్షకు హాజరుకానున్న ఓ విద్యార్థినికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశించింది.

Chennai: అనారోగ్యంతో ఉన్న విద్యార్థినికి

‘నీట్‌’లో ప్రత్యేక వెసులుబాటు

  • 8 మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

చెన్నై, మే 2 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో బాధపడుతూ ‘నీట్‌’ పరీక్షకు హాజరుకానున్న ఓ విద్యార్థినికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాధన్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న తాను, మూత్రవిసర్జనను నియంత్రించలేని స్థితిలో ఉన్నానని, అందువల్ల తప్పనిసరిగా డైపర్‌ ధరించాల్సివుండడంతో పాటు మాటిమాటికీ డైపర్‌ మార్చాల్సిన పరిస్థితి ఉన్నందున.. అందుకు అవసరమైన వెసులుబాటును కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఓ 19 ఏళ్ల యువతి హైకోర్టును ఆశ్రయించింది.


ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్‌ 4 ఏళ్ల వయస్సులోనే అగ్నిప్రమాదానికి గురవడంతో మూత్రవిసర్జనను నియంత్రించుకోలేని పరిస్థితి నెలకొందని న్యాయమూర్తి పేర్కొన్నారు. పిటిషనర్‌ పరీక్షకు డైపర్‌ ధరించి వెళ్లడంపైనా, డైపర్‌ మార్చుకొనేందుకు అవకాశం కల్పించడంపైనా అధికారులు ఆ బాలిక పరీక్షకు హాజరయ్యే కేంద్రం అధికారికి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 03 , 2024 | 05:31 AM