Share News

Crime News: తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యుడిపై కత్తిపోట్లు.. నిందితుడి సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:23 PM

తన తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యుడిని కత్తితో పొడిచిన నిందితుడిని ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని చితకబాదారు.

Crime News: తల్లికి చికిత్స అందిస్తున్న వైద్యుడిపై కత్తిపోట్లు.. నిందితుడి సంచలన ఆరోపణలు
Chennai Hopital

చెన్నై: తమిళనాడులో వైద్యుడిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. క్యాన్సర్ పేషెంట్ అయిన తన తల్లికి వైద్యం అందిస్తున్న వైద్యుడిపై నిందితుడు 7 సార్లు కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో అతడు స్వల్ప గాయాలతో బయట పడినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఇటువంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా చూడాలని అధికారులను ఆదేశించింది. అయితే, డాక్టర్ ను కత్తితో పొడిచి ఎలాంటి భయం లేకుండా నడుచుకుంటూ బయటకు వెళ్లిపోతున్న నిందితుడిని కొందరు వీడియో తీశారు. ఇప్పటికైనా అతడిని పట్టుకోండి అంటూ కొందరు పక్కనుంచి కేకలు వేయడం వినిపిస్తోంది. అందుకు సమాధానంగా నిందితుడు చేసిన ఆరోపణలు కీలకంగా మారాయి. తన తల్లికి తప్పుడు వైద్యం చేసిన కారణంగానే వైద్యుడిపై దాడి చేసినట్టు అతడు ఆరోపిస్తున్నాడు. ‘మీ అమ్మా నాన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది నీకు’ అంటూ ఓ వ్యక్తిని ఎదురు ప్రశ్నిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోబోయాడు. చివరికి అతడిని బంధించిన ఆస్పత్రి సిబ్బంది నిందితడిపై దాడి చేసి బంధించారు.


ఒక సీనియర్ డాక్టర్ దీనిపై స్పందిస్తూ.. డాక్టర్ బాలాజీకి నుదురు, వీపు, చెవి వెనుక కడుపుపై ​​గాయాలైనట్టు తెలిపారు. ఆయన ఐసీయూలో ఉన్నారని, ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్ తెలిపారు. ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. మరోసారి ఇలాంటి దాడి జరగదని హామీ ఇచ్చారు. "వైద్యుల సేవలు ప్రశంసనీయం.. వారి భద్రతకు భరోసా ఇవ్వడం మా బాధ్యత.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది" అని ఎక్స్‌పై పోస్ట్‌లో పేర్కొన్నారు.


ఆగస్టులో కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం-హత్య తర్వాత జరిగిన ఈ సంఘటన వైద్యుల భద్రతపై మళ్లీ చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, విధి నిర్వహణలో ఉన్న వైద్యులకు భద్రత కల్పించేందుకు జాతీయ టాస్క్ ఫోర్స్ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది.

Maharashtra Elections: డిప్యూటీ సీఎం హెలికాప్టర్, బ్యాగులు తనిఖీ చేసిన ఈసీ


Updated Date - Nov 13 , 2024 | 06:08 PM