Share News

Box Breathing: బాక్స్ శ్వాస అంటే ఏమిటి? దీని ప్రధాన ప్రయోజనాలు ఏంటి..!

ABN , Publish Date - Mar 22 , 2024 | 04:05 PM

కళ్ళు మూసుకుని, ఆపైన ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకోవాలి, నాలుగు విధాలుగా గాలిని పీల్చుకుని, వదిలి ఇలా గాలి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది.

Box Breathing: బాక్స్ శ్వాస అంటే ఏమిటి? దీని ప్రధాన ప్రయోజనాలు ఏంటి..!
breathing

బాక్స్ శ్వాస అనేది ఒక శక్తివంతమైన శ్వాస టెక్నిక్, ఇది ఒత్తిడితో ఉన్నవారిలో ఊపిరి పీల్చడం, శ్వాసను పట్టుకోవడం ద్వారా రిలీఫ్ ని ఇస్తుంది. ఇది చేయడం వల్ల మనస్సును క్లియర్ చేయడం, శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, దృష్టిని మెరుగుపరచడం వంటి చర్యల్లో సహాయపడుతుంది.

బాక్స్ బ్రీతింగ్ నాలుగు ప్రాథమిక దశలు ప్రతి ఒక్కటి 4 సెకన్లు :

శ్వాస తీసుకోవడం

ఊపిరి బిగపట్టి

ఊపిరి వదిలి,

ఊపిరి బిగపట్టి

ఇలా బాక్స్ శ్వాసను రీసెట్ చేయడం అని కూడా పిలుస్తారు, ఇది చేయడం సులభం. ఒత్తిడితో ఉన్నవారికి ఇది చాలా సులభంగా ఆచరించే టెక్నిక్.

1. సైనికులు, పోలీసు అధికారులు వంటి అధిక ఒత్తిడి ఉద్యోగాలు ఉన్న వ్యక్తులు, వారి శరీరాలు ఫైట్-ఆర్-ఫ్లైట్ మోడ్‌లో ఉన్నప్పుడు తరచుగా బాక్స్ శ్వాసను ఉపయోగిస్తారు. ఈ పద్దతి ఏకాగ్రతను మెరుగుపరచడానికి సహకరిస్తుంది.

2. బాక్స్ బ్రీతింగ్ అనేది ఒక వ్యక్తి వర్క్ డెస్క్‌లో లేదా ఎక్కడైనా చేయగల ఒక సాధారణ టెక్నిక్.

ఇవి కూడా చదవండి: అధిక బరువు తగ్గించే శాకాహారం.. రోజూ తీసుకుంటే .!

ఈ పండు రోజూ తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ పెరుగుతుందట...!

వేసవిలో వికసించే ఈ పూలమొక్క.. మొత్తం తోటకే అందాన్ని తెస్తుంది.. వీటిలో..

ఉల్లిపాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా..!


బాక్స్ శ్వాసను ప్రయత్నించడానికి..

1. సౌకర్యవంతమైన కుర్చీలో వీపుకు నిటారుగా ఉంచి, పాదాలను నేలపై ఉంచి కూర్చోవాలి.

2. కళ్ళు మూసుకుని, ఆపైన ముక్కు ద్వారా ఊపిరి పీల్చుకోవాలి, నాలుగు విధాలుగా గాలిని పీల్చుకుని, వదిలి ఇలా గాలి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది.

3. నోరు లేదా ముక్కును బిగించకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నప్పుడు నెమ్మదిగా నాలుగు వరకు లెక్కపెడుతూ శ్వాసను పట్టుకోవాలి.

4. 1 నుండి 3 దశలను కనీసం మూడు సార్లు చేస్తూ ఉండాలి.

వేసవిలో మట్టి కుండలో నీటిని ఎందుకు తాగాలి..! దీనితో కలిగే ప్రయోజనాలేంటి..!


బాక్స్ శ్వాస ప్రయోజనాలు..

1. నాడీ వ్యవస్థను (ANS) ప్రశాంతపరుస్తుంది. నియంత్రిస్తుంది.

2. అసంకల్పిత శరీర విధులను నియంత్రిస్తుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. తక్షణ ప్రశాంతతను అందిస్తుంది.

3. శ్వాసను నెమ్మదిగా పట్టుకోవడం వల్ల రక్తంలో CO2 పేరుకుపోతుంది. పెరిగిన రక్తం CO2 పారాసింపథెటిక్ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. ఇది మనస్సు, శరీరంలో ప్రశాంతమైన, రిలాక్స్డ్ అనుభూతిని ఇస్తుంది.

4. బాక్స్ శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆందోళన రుగ్మత (GAD), పానిక్ డిజార్డర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD), డిప్రెషన్ వంటి పరిస్థితులకు ఇది అసాధారణమైన చికిత్స చేస్తుంది.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Mar 22 , 2024 | 04:05 PM