Health Tips : వానాకాలం దగ్గు తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అవండి చాలు..!
ABN , Publish Date - Aug 01 , 2024 | 10:57 AM
బ్యాక్టీరియా, వైరస్ కారణంగా గొంతు నొప్పి, దగ్గు, ముక్కుకారడం, ఛాతీలో రద్దీ, సైనస్ ఇబ్బంది ఉంటాయి.
వానలు పడుతున్నాయంటే జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ ఇలా చాలా రకాల ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వర్షాల కారణంగా వాతావరణంలో చేరుకునే తేమ రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుంది. బ్యాక్టీరియా, వైరస్ కారణంగా గొంతు నొప్పి, దగ్గు, ముక్కుకారడం, ఛాతీలో రద్దీ, సైనస్ ఇబ్బంది ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బలహీనపడుతుంది. ఈ ఇబ్బందిని మనం రోజువారి తీసుకునే ఆహారాలతో తగ్గించుకోవచ్చు. అవేమిటంటే..
వానలో తడిస్తే జలుబు చేస్తుంది. ఎక్కువ సమయం అలాగే ఉంటే రోగనిరోధక శక్తి బలహీనమై జ్వరం, దగ్గు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా పొడి బట్టలు వేసుకోవడం, వెచ్చని వాతావరణంలో ఉండటం, వేడి పదార్థాలను మాత్రమే తీసుకోవడం చేయాలి. వైరస్ బారిన పడకుండా ఇంటి వాతావరణాన్ని వెచ్చగా ఉంచాలి. పరిసరాల శుభ్రతను పాటించాలి. గోరు వెచ్చని నీటిని మాత్రమే తీసుకోవాలి. ఇంటి చుట్టూ వర్షం నీటిని నిల్వ ఉండనీయకుండా చూడాలి. దోమల సమస్యను తగ్గించాలి.
జలుబు, దగ్గు నివారణకు..
అల్లం..
దగ్గు, జలుబులతో ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ముఖ్యంగా పనిచేస్తుంది.
Health Tips : తిన్న తర్వాత విషంగా మారే ఆహారపదార్ధాలు ఇవే..
తులసి..
తులసి భారతదేశంలో ఇంటి వాతావరణంలో పచ్చగా పెరిగే మొక్క. అలాంటి ఈ తులసిలో చాలా గుణాలున్నాయి. తులసిలో ఉన్న యాంటీ బాక్టీరియల్ ఏజెంట్, ఇది ఇన్ఫెక్షన్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. తులసి శ్వాసకోశ ఇబ్బందిని తగ్గించడంలో, పొడి దగ్గుకు సమర్థవంతమైన నివారణగా పనిచేస్తుంది.
Health Tips : ఈ జాగ్రత్తలు తీసుకుంటే మెడనొప్పి ఇబ్బంది ఉండదు..!
పండ్లు, కూరగాయలు..
విటమిన్ సి జలుబును తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి బలోపేతం చేస్తుంది. ఆహారంలో ఎక్కువగా సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల.. జలుబుకు నివారణగా పనిచేస్తాయి. విటమిన్ సి, కివి పండు, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, రెడ్ బెల్ పెప్పర్, బ్రస్సెల్స్, మొలకలు, కాలీఫ్లవర్, టమాటాలు మొదలైనవి వానాకాలం ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
ఉల్లిపాయ రసం..
ప్రతి భారతీయ వంటగదిలో ఉల్లిపాయ తప్పక ఉంటుంది. ఈ ఉల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు పొడి దగ్గు నివారణగా పనిచేస్తాయి.
Health Tips : కాల్చిన అల్లం, తేనెతో జలుబు, గొంతు నొప్పికి చెక్ పెట్టండిలా... !
తేనె..
క్రమం తప్పకుండా తేనెను తీసుకుంటే తీవ్రమైన దగ్గు నుంచి తేలిక చేస్తుంది. ఇది యాంటీబయాటిక్స్ అవసరాన్ని తగ్గిస్తుందని పరిశోధనలు కూడా చెబుతున్నాయి.
వేడి ద్రవాలు..
అధ్యయనం ప్రకారం, వేడి పానీయాలు గొంతు నొప్పి, చలి, అలసట వంటి లక్షణాలకు తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.