Soak Before Eating : ఈ పదార్ధాలను ఎందుకు తినే ముందు నానబెట్టి తినాలి..!
ABN , Publish Date - Jul 25 , 2024 | 02:55 PM
రాజ్మా, గట్టి చిక్కుళ్లను ఉడికించే ముందు నీటిలో నానబెట్టడం వల్ల త్వరగా వండేందుకు వీలవుతుంది.
ఈ రోజుల్లో క్షణాల్లో వంట అయిపోవాలని సమయాన్ని లెక్కకడుతూ వంట చేసేవారే అంతా. త్వరత్వరగా ఆహారం ఉడికించేసుకుని తినడం కారణంగా అజీర్తి, ఉబ్బరం, మలబద్దకం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వ్యాధులు రాకుండా ఉండాలంటే చాలా వరకూ మనం తీసుకునే ఆహారాలను నీటితో కడిగి శుభ్రం చేసి తింటూ ఉంటాం. ఇలా చేయడం వల్ల పదార్థాలపై ఉన్న మలినాలు పోయి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి వీలవుతుంది. అయితే కొన్ని శక్తిని అందించే ఆహార పదార్థాలు ఎక్కువ సేపు నీటిలో నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఏ పదార్థాలను నానబెట్టి, ఉడికించి తీసుకోవాలో తెలుసుకుందాం.
ఎక్కువ సమయం పదార్థాలను నీటిలో నానబెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అందుతాయంటే..
గింజలు, తృణధాన్యాలు ..
పోషకాహారంలో ముఖ్య పాత్ర పోషించేది డ్రైఫ్రూట్స్, గింజలు వీటిని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు శరీరానికి అందుతాయి. గింజలలో, తృణధాన్యాలలో అధిక స్థాయిలో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వాతావరణంలో వివిధ కారకాల నుంచి రక్షించడంలో భాగంగా పైన పొరలాగా పనిచేస్తుంది. ఒక్కసారిగా నానబెట్టని గింజలను తినడం వల్ల చికాకు కలుగుతుంది. జీర్ణ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నానబెట్టే గింజల్లో ముఖ్యంగా బాదం, వాల్ నట్స్ రాత్రి సమయంలో నానబెట్టాలి. అదే తృణధాన్యాలయితే వంటచేయడానికి ఆరు గంటల ముందే నీటిలో నానబెట్టి వండటం మంచిది. ఇలా చేయడం వల్ల త్వరగా ఆహారం ఉడికేందుకు అవకాశం ఉంటుంది.
Health Tips : ఎయిర్ పాడ్స్ వాడితే బ్రెయిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా..!
చిక్కుళ్లు..
రాజ్మా, గట్టి చిక్కుళ్లను ఉడికించే ముందు నీటిలో నానబెట్టడం వల్ల త్వరగా వండేందుకు వీలవుతుంది. చిక్కుళ్ళలో కూడా అధికంగా ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. వండడానికి ముందు నీటిలో నానబెట్టడం వల్ల ఈ సమ్మేళనాల స్థాయిలు తగ్గుతాయి. ఉడికించడం వల్ల జీర్ణం కావడం తేలికవుతుంది. వండే సమయం కూడా తగ్గుతుంది.
కూరగాయలు..
కూరగాయలను ఆహారం తయారుచేసే ముందు నీటిలో వేసి కడిగి, వండుతుంటాం. దీనివల్ల వాటిపై ఉండే మలినాలు, మురికి పోతుంది. ఉడికించి వండటం వల్ల వంటచేసే సమయం తగ్గుతుంది.
Health Tips : నాన్‌స్టిక్ పాత్రల్లో వంట తింటే ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టేనా..!
డ్రైఫ్రూట్స్..
ఆప్రికాట్లు, ఖర్జూరం, అక్రోడ్స్, ఎండుద్రాక్ష వంటి డ్రైఫ్రూట్స్ లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వాటిలో సల్ఫైట్స్ కూడా పుష్కలంగా ఉన్నాయి. జీవక్రియలో భాగంగా ఆహార పదార్ధాలు త్వరగా జీర్ణం కావాలన్నా, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలంటే వాటి స్వభావాన్ని బట్టి నానబెట్టి, ఉడికించి తీసుకోవడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు వీలవుతుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.