Share News

Health Benefits : పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిది..!

ABN , Publish Date - Jul 24 , 2024 | 01:00 PM

బాదం వెన్నలో ముఖ్యంగా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పనితీరును, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Health Benefits : పీనట్ బటర్, ఆల్మండ్ బటర్ ఇందులో ఏది ఆరోగ్యానికి మంచిది..!
Health Benefits

ఆరోగ్యాన్ని పెంచేందుకు పిల్లలు, పెద్దలు డ్రైఫ్రూట్స్, గింజలను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా బాదంపప్పు, వేరుశనగపప్పు ఎక్కువగా చిరుతిండి జాబితాలో ఉంటూనే ఉంటాయి. వేరుశనగపప్పు, బాదం అంత ఖరీదు కాకపోయినా దీనిలోని గుణాలు బాదంపప్పుతో సమానంగానే ఉంటాయి. అయితే వేరుశనగ వెన్న, బాదం వెన్న ఇందులో ఏది ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తుంది అనే విషయానికి వస్తే..

బాదం, వేరుశనగలు ఎక్కువ ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహార పదార్ధాలు. ఈ గింజల్లో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. వీటిలో పోషకాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వేరుశనగ వెన్న, బాదం వెన్న వీటిని ఒకదానితో ఒకటి పోల్చినపుడు వేరుశనగ వెన్నలో రెండు టేబుల్ స్పూన్లలో 190 కేలరీలు, 8 గ్రాముల ప్రోటీన్, 16 గ్రాముల కొవ్వును కలిగి ఉంటుంది. ఇందులో 3 గ్రాముల సంతృప్త కొవ్వులు, 8 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వులు, 5 గ్రాముల పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. వేరుశనగ వెన్నలో 2 టేబుల్ స్పూన్ల వెన్నలోనూ 2 గ్రాముల ఫైబర్, 3 గ్రాముల చక్కెర సహా 6 గ్రాముల కార్బోహైడ్రేట్లను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్ ఇ 15శాతం, మెగ్నీషియం 12 శాతం, నియాసిన్ 20 శాతం, ఫోలేట్ 10 శాతం ఉన్నాయి.

బాదం వెన్న..

ఇందులో వేరుశనగతో పోల్చితే రెండు టేబుల్ స్పూన్ల బాదం వెన్నలో 200 కేలరీలు, 6 గ్రాముల ప్రోటీన్, 18 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇందులో 1.5 గ్రాముల సంతృప్త కొవ్వు, 12 గ్రాముల మోనోశాచురేటెడ్ కొవ్వు, 3.5 గ్రాముల పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వు ఉంటాయి. బాదం వెన్నలో 6 గ్రాముల కార్బోహైడ్రేట్లు కూడా ఉన్నాయి. అయితే ఫైబర్ కంటెంట్ 3.5 గ్రాములు, తక్కువ చక్కెరలు 1 గ్రాము కలిగి ఉంటాయి. బాదం వెన్నలో ముఖ్యంగా విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఇ, 45శాతం, మెగ్నీషియం 25 శాతం, కాల్షియం 10 శాతం, రిబోఫ్లావిన్ 15 శాతం అందిస్తుంది.

Health Tips : అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిల్లోనే ఎందుకు టైప్ 1 డయాబెటిస్ ప్రమాదం ఎక్కువ..!


వేరుశనగ వెన్నలో..

వేరుశనగ వెమ్మలో ప్రోటీన్ అద్భుతంగా ఉంటుంది. కండారల మరమ్మత్తుకు, పెరుగుదలకు ఇది ప్రధానంగా అవసరం.

మోనో అసంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రెస్వెరాట్రాల్ కూడా కలిగి ఉంటాయి. గుండె సమస్యలను, వ్యాధుల ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.

సాధారణంగా బాదం వెన్న కంటే కూడా తక్కువ ఖరీదులో లభించే వేరుశనగ వెన్న సులువుగా అందరికీ అందుబాటులో ఉంటుంది.

Benefits of Vitamin C : చర్మ సౌందర్యానికి విటమిన్ సి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది?

దీనితో కలిగే ఇబ్బందులు...

1. వేరుశెనగ వెన్నతో అలెర్జీ రావడానికి కూడా అవకాశం ఉంది.

2. వేరుశనగ అప్లాటాక్సిన్‌లతో కలుషితం కావచ్చు. సరైన నిల్వ చేయనప్పుడు ఈ ప్రమాదం ఉంటుంది.

బాదం వెన్న..

బాదం వెన్నలో ఎక్కవ మోనోశాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.

బాదం వెన్నలో ముఖ్యంగా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పనితీరును, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఈ వెన్నలో తక్కువ చక్కెరలు ఉంటాయి.


Human brain : మానవ మెదడు గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా..!

దీనితో కలిగే ఇబ్బందులు...

బాదం వెన్న సాధారణంగా ఖరీదైనది.

బాదం వెన్న కంటే కొంచెం తక్కువ ప్రోటీన్ ఉంటుంది.

ఏది బెస్ట్..

వేరుశనగ వెన్న, బాదం వెన్న కన్నా ఆరోగ్యప్రయోజనాలకు బెస్ట్ ఎంపిక. విటమిన్లు, ఖనిజాలకు ముఖ్యంగా విటమిన్ ఇ, మెగ్నీషియంకు ప్రాధాన్యత ఇవ్వాలంటే మాత్రం బాదం వెన్న సరైనది.

Read Latest Navya News and Telugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Jul 24 , 2024 | 01:25 PM