Smoking : ధూమపానాన్ని వదిలేసే ఆరోగ్య చికిత్సలు ఇవే..
ABN , Publish Date - Mar 12 , 2024 | 04:47 PM
పొగాకు వినియోగమే ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. నికోటిన్ గమ్, లాజెంజెస్, నాసల్ స్ప్రేలు లేదా ఇన్హేలర్లు వంటి నికోటిన్ రీప్లేస్ మెంట్ థెరపీలు ధూమపాన వ్యసనాన్ని అధిగమించడంలో సహాయపడతాయి.
ధూమపానం( Smoking) అనేది దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమాజాలలో లోతుగా పాతుకుపోయిన అలవాటు. ఏది ఏమైనప్పటికీ, ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనేది వాస్తవం. పొగాకు వినియోగమే ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. నికోటిన్ గమ్, లాజెంజెస్, నాసల్ స్ప్రేలు లేదా ఇన్హేలర్లు వంటి నికోటిన్ రీప్లేస్ మెంట్ థెరపీలు ధూమపాన వ్యసనాన్ని అధిగమించడంలో సహాయపడతాయి. నికోటిన్ గమ్, లాజెంజెస్, నాసల్ స్ప్రేలు లేదా ఇన్హేలర్లు వంటి నికోటిన్ రీప్లేస్ మెంట్ థెరపీలు ధూమపాన వ్యసనాన్ని అధిగమించడంలో సహాయపడతాయి.
• ఒక సిగరెట్‌లో 4800 రసాయనాలు ఉంటాయి, వీటిలో 69 క్యాన్సర్ ట్రిగ్గర్లు ఉన్నాయి.
• పొగాకు కారణంగా ప్రతి ఆరు సెకన్లకు ఒకరు మరణిస్తున్నారు •
భారతదేశంలో 12 కోట్ల మంది పొగాకు వినియోగదారులు ఉన్నారు (ధూమపానం చేసేవారు, పొగాకు నమిలే వారు)
• పదిమందిలో ప్రతి 9వ భారతీయుడు పొగాకును ఉపయోగిస్తున్నారు.
• వారిలో మూడింట ఒక వంతు పొగాకు కారణంగా చనిపోవడం అనేది విచారకరం.
• పొగాకు సంబంధిత వ్యాధుల చికిత్సకు వైద్య ఖర్చులు సంవత్సరానికి 90 కోట్లు అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: జలుబుని ఇట్టే తరిమేసే హెర్బల్ టీలను ఎలా తయారు చేసుకోవాలో తెలుసా.. !
ఈ అలవాటును ఎలా తప్పించుకోవాలి.
1. ధూమపానం చేయమని ప్రేరేపించే ట్రిగ్గర్‌లను కనుక్కోవాలి.
2. పొగాకు తాగాలనే కోరికను నిరోధించడానికి చక్కెర లేని గమ్, హార్ట్ మిఠాయిని తినడం, నమలడం వంటివి ఈ ఆలోచనను తగ్గిస్తాయి.
3. శారీరక శ్రమను చేసైనా, పొగాకు కోరిక కలిగినపుడు నియంత్రించుకోవడం సాధన చేయండి.
4. ఒత్తిడిని ఎదుర్కోవటానికి ధూమపానం మార్గం కాదు. ధ్యానం వంటి కొన్ని అలవాట్లతో ఈ అలవాటును తప్పించవచ్చు.
5. సన్నిహితులతో కనెక్ట్ అవ్వండి. ధూమపానం, పొగాకు అలవాటు తగ్గడానికి నలుగురితో కలిసి సమయాన్ని పంచుకున్నా కూడా ఇది తగ్గవచ్చు.
దంతాలను సహజంగా తెల్లగా చేసుకోవడం ఎలా..!
జుట్టు పెరగాలంటే ఈ సమస్యలు దాటేస్తే చాలు.. ఒత్తైన జుట్టు మీ సొంతం..!
ఆలోచనను మార్చి పడేసే పాప్‌కార్న్ బ్రెయిన్ గురించి తెలుసా..!
మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.