Puri Jagannath Temple: ఆలయంపై అద్భుతం.. జెండాతో గరుడ పక్షి ప్రదర్శన.. వీడియో వైరల్..
ABN , Publish Date - Apr 16 , 2025 | 10:59 AM
పూరీ జగన్నాథ ఆలయంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఆలయంపై ఓ గరుడ పక్షి జెండాతో ప్రదక్షిణలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలీదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పూరీ జగన్నాథ ఆలయంలో అద్భుత ఘటన చోటు చేసుకుంది. ఆలయంపై ఓ గరుడ పక్షి జెండాతో ప్రదక్షిణలు చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇందులో వాస్తవం ఎంతుందో తెలీదు గానీ.. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు చూసిన నెటిజన్లు.. ఇదంతా జగన్నాథుడి మహిమే అంటూ కామెంట్లు చేస్తున్నారు..
సోషల్ మీడియాలో పూరీ జగన్నాథ ఆలయానికి (Puri Jagannath Temple) సంబంధించిన వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఆలయ గోపురంపై ఓ గరుడ పక్షి ప్రదక్షిణలు చేయడం, అందులోనూ జెండాను నోట కరుచుకుని చక్కర్లు కొట్టడం భక్తులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఈ ఆలయం గోపురంపై నిత్యం జెండా ఎగురుతూ ఉంటుంది. అధికారులు ఆ జెండాలను ఎప్పటికప్పుడు మారుస్తుంటారు.
Live Death Video: అడుగు దూరంలో మరణం.. గుండెల్ని మెలిపెట్టే సీన్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
అయితే శనివారం సాయంత్రం ఉన్నట్టుండి ఓ గురుడ పక్షి అటుగా వచ్చి ఆలయ గోపురంపై చక్కర్లు కొట్టింది. దాని కాళ్లకు పొడవాటి జెండా వేలాడుతూ ఉంది. జెండాతో సహా ఆ పక్షి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది. ఆ తర్వాత సముద్రం వైపు ఎగురుకుంటూ వెళ్లి.. ఆ తర్వాత పూర్తిగా అదృశ్యమైందని భక్తులు చెబుతున్నారు. పూరీ జగన్నాథ ఆలయ సందర్శనాకి వచ్చే భక్తులు.. ముందుగా పతితపావన జెండా దర్శనం చేసుకోవడం ఆనవాయితీ. జెండాను దర్శించుకున్న అనంతరం జగన్నాథుడి దర్శనం కోసం వెళ్తారు.
Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..
ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు నిత్యం మారుస్తుంటారు. రోజూ సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తుంటారు. అలాగే భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కట్టేస్తుంటారు. ఈ పక్షి ఆ జెండాను ఎత్తుకెళ్లిందా, ప్రమాదవశాత్తు అలా జరిగిందా, లేక గ్రాఫిక్స్ వీడియోనా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు భక్తులు మాత్రం ఇదంతా ఆ దేవుడి మహిమేనంటూ చర్చించుకుంటున్నారు. అయితే ఈ ఘటనలపై ఆలయ అధికారుల నుంచి ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. కానీ ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Funny Viral Video: ఓయో రూంలో ప్రేమ జంట.. తలుపులు వేయడం మర్చిపోవడంతో.. చివరకు..
Viral Video: బాత్‌రూం క్లీనింగ్ అంటే ఇదా.. బ్యాక్టీరియాకే చెమటలు పట్టించాడుగా..