Proten Rich Foods : కండరాల పెరుగుదలకు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు ఎంత వరకూ సపోర్ట్ ఇస్తాయి..!
ABN , Publish Date - Jun 17 , 2024 | 01:57 PM
కండర ద్రవ్యరాశిని పెంచడానికి ప్రోటీన్ అవసరం. కండరాల పెరుగుదలకు ప్రోటీన్ ఆహారం అవసరం. బరువు తగ్గాలన్నా, తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి.
కండరాలను నిర్మించడానికి ఆకలిని తగ్గించడానకి అధిక ప్రోటీన్ స్నాక్స్ అవసరం. ఎముకలు, కండరాలు చర్మాన్ని నిర్మించడానికి శరీరంలోని అన్ని అవయవాలు సరిగా పనిచేయడానికి ఆహారంలో తగినంత ప్రోటీన్ అవసరం. కణాలు, కణజాలాలను సరిచేయడానికి కూడా ప్రోటీన్ అంతే అవసరం.పెరిగి పెద్దవారు కావడానికి ప్రోటీన్ పాత్ర చాలా ఉంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది సార్కోపెనియా, కండర ద్రవ్యరాశి, శక్తిని కోల్పోయే వయస్సు సంబంధిత ధోరణిని తగ్గించడంలో కూడా ప్రోటీన్ కీలకంగా వ్యవహరిస్తుంది.
1. డైటరీ ప్రోటీన్ కూడా బరువు నియంత్రణలో ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచేందుకు ప్రోటీన్ సహకరిస్తుంది.
2. ప్రోటీన్ గర్భవతిగా ఉన్న స్త్రీ తీసుకునే ఆహారం అందులోని ప్రోటీన్ స్థాయిలను బట్టి బిడ్డ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
3. శరీరానికి ఒకేసారి 20 నుంచి 40 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ప్రాసెస్ చేయగలవు. అయితే ఒకేసారి భోజనంలో ప్రోటీన్ పొందాలని ఆలోచించకూడదు. ప్రతీ రోజూ ఇంతని ప్రోటీన్ తీసుకునేలా ప్లాన్ చేయాలి. ఐదు గ్రాముల ప్రోటీన్ తీసుకునేలా చూడాలి. దీనికి మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, సోయా, చిక్కుళ్ళు, గింజలు, తృణధాన్యాలు ప్రోటీన్ పొందడానికి అవసరం.
Golconda Bonalu Festival : జూలై 7న వైభవంగా జరగనున్న గోల్కొండ బోనాలు జాతర..
అధిక ప్రోటీన్ స్నాక్స్ ..
కండర ద్రవ్యరాశిని పెంచడానికి ప్రోటీన్ అవసరం. కండరాల పెరుగుదలకు ప్రోటీన్ ఆహారం అవసరం. బరువు తగ్గాలన్నా, తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాలు జీర్ణక్రియను నెమ్మదించేలా చేస్తాయి. బ్లడ్ షుగర్ ఉన్నవారికి చక్కెర లెవల్స్ స్థిరంగా ఉండేలా చేస్తుంది. భోజనంలో అతిగా తినకుండా ఉండేలా చేస్తుంది.
1. స్నాక్స్‌లో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శక్తిని అందించడంలో సహాయపడతాయి.
2. చిక్ పీస్ కలిపి తయారుచేసే వంటకంలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇందులో దోసకాయ, టమాటా, ఎర్ర ఉల్లిపాయ, ఫెటా, ఆలివ్ ఆయిల్ కలిపి చేసే చాలా రుచిగా ఉంటుంది.
Blood Sugar Control : ఈ ఫుడ్స్‌ను తిన్నారో షుగర్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయంతే..!
3. బీఫ్ జెర్కీ మంచి రుచికరమైన వంటకం.
4. గుమ్మడి గింజలు.. సలాడ్లు, బటర్ నట్ స్క్వాష్ సూప్ లలో వేయించిన గుమ్మడిగింజలు రుచికరంగా ఉంటాయి.
5. వేరుశనగ వెన్న.. ఇది రెండు స్పూన్లు తీసుకుంటే మంచి శక్తి కలుగుతుంది. టోస్ట్ వేరుశెనగ వెన్నను తీసుకుంటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది.
6. చియా విత్తనాల్లో అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. రెండు టేబుల్ స్పూన్ల చియా విత్తనాలు 5 గ్రాముల ప్రోటీన్ కలిగి ఉంటాయి. వీటిని పుడ్డింగ్, జ్యూస్ లలో, షేక్స్ ఇలా ఎందులోనైనా తీసుకోవచ్చు.
7. కాటేజ్ చీజ్ కూడా ప్రోటీన్ కలిగి ఉంటుంది.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.