Share News

OTT : ఈ వారమే విడుదల

ABN , Publish Date - Jul 28 , 2024 | 06:00 AM

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

OTT : ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

ott.jpg

సినిమా బాహుబలి కథ

‘బాహుబలి’ సిరీస్‌ చిత్రాలతో తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో మేటిగా నిలిపి దర్శకుడిగా పేరు ప్రతిష్ఠలు ఆర్జించారు రాజమౌళి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో భారత పతాకను రెపరెపలాడించాడు. ఆ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ దక్కడంతో దర్శకుడిగా ఆయన పేరు మార్మోగింది. దేశంలో పాపులర్‌ డైరెక్టర్స్‌, అత్యధిక పారితోషికం అందుకునే దర్శకుల్లో ఆయనది అగ్రస్థానం. ఈ నేపథ్యంలో రాజమౌళిపై ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ అనే డాక్యుమెంటరీ తెరకెక్కుతోంది. రాఘవ్‌ కన్నా దర్శకత్వంలో సమీర్‌ నాయక్‌, దీపక్‌ సెగల్‌ నిర్మించారు. ఇటీవలే ట్రైలర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. హాలీవుడ్‌, బాలీవుడ్‌, టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు రాజమౌళిపై తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ‘మోడ్రన్‌ మాస్టర్స్‌’ ఆగస్టు 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవనుంది.

Updated Date - Jul 28 , 2024 | 07:31 AM