Watch Photos: బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి..
ABN, Publish Date - Feb 23 , 2024 | 01:56 PM
హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత సంగారెడ్డి, పటాన్చెరు పరిధిలోని ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని రింగ్‌రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు చేయగా కేవలం రెయిలింగ్‌ను ఢీకొనడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరగలేదన్న అంచనాకు వచ్చారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు..

లాస్య నందిత ఎమ్మెల్యేగా పదవిని చేపట్టి కనీసం ఏడాది కూడా కాకమునుపే కన్నుమూశారు. ఆమెకు ఎమ్మెల్యే గా కాలం కలిసి రాలేదని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. తొలుత లిప్ట్‌లో ఇరుక్కుని తొలి ప్రమాదం నుంచి ఆమె బయట పడ్డారు. ఆ తరువాత నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13న రెండవ సారి ప్రమాదానికి గురయ్యారు. మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె మృతి చెందారు.

కంటోన్మెంట్ బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత సంగారెడ్డి, పటాన్చెరు పరిధిలోని ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని రింగ్‌రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.

లాస్య నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌ను కలుసుకున్న దృశ్యం.

రోడ్డు ప్రమాదానికి గురై మరణించిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత

రోడ్డు ప్రమాదంలో రెయిలింగ్‌ను ఢీకొని నుజ్జు నుజ్జు అయిన ఎమ్మెల్యే లాస్య నందిత కారు..

రోడ్డు ప్రమాదానికి గురైన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత కారును క్రేన్ సహాయంతో బయటకు తీస్తున్న పోలీసులు..
Updated at - Feb 23 , 2024 | 02:01 PM