Minister Jupalli: ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు
ABN, Publish Date - Mar 16 , 2025 | 11:40 AM
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి జూపల్లి కృష్ణారావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు నిష్టతో కఠిన ఉపవాసాన్ని ఆచరిస్తారని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

ఈ రంజాన్ మాసం సమాజంలో సామరస్యాన్ని, సంతోషాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొదిస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావును ముస్లిం సోదరులు కోరారు.
Updated at - Mar 16 , 2025 | 11:55 AM