Minister Nara Lokesh: స్వచ్ఛతలో మంగళగిరిని నంబర్ వన్‌గా మారుస్తా
ABN, Publish Date - Mar 16 , 2025 | 10:32 AM
మంగళగిరిలోని ఎకో పార్కులో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా మంత్రి లోకేష్ స్వయంగా చెత్తను ఊడ్చి ఎత్తి చెత్తకుండీలో వేశారు.

మంగళగిరిలోని ఎకో పార్కులో ‘స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

ఇందులో భాగంగా మంత్రి లోకేష్ స్వయంగా చెత్తను ఊడ్చి ఎత్తి చెత్తకుండీలో వేశారు.

స్వచ్ఛతలో మంగళగిరిని నంబర్ వన్‌గా మారుస్తానని మంత్రి నారా లోకేశ్ ఉద్ఘాటించారు. పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజల్లో మరింత చైతన్యాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

విదేశాల్లో ఎవరూ చెత్తను ఇష్టం వచ్చినట్లు బయట వేయరని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

పారిశుధ్యంపై అవగాహన కోసం మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

స్వచ్ఛతలో మంగళగిరిని ఆదర్శ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతానని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు.

పారిశుధ్య నిర్వహణకు ప్రజారోగ్యానికి మధ్య అవినాభావ సంబంధం ఉందని మంత్రి నారా లోకేష్ చెప్పారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా వ్యాధులను నివారించే వీలు అవుతందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.

మంగళగిరిలో త్వరలోనే భూగర్భ డ్రైనేజి, అండర్ వాటర్, గ్యాస్, పవర్ లైన్ల ఏర్పాటుకు సంబంధించిన పనులను చేపడతామని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
Updated at - Mar 16 , 2025 | 10:35 AM