Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు!

ABN, Publish Date - Dec 01 , 2024 | 05:21 PM

చలికాలంలో ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు భారతీయులు పసుపును తరతరాలుగా వినియోగిస్తున్నారు. ప్రతి వంటింట్లో కనిపించే పసుపులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. మరి ఈ కాలంలో పసుపు ప్రయోజనాలను పూర్తిస్థాయిలో పొందేందుకు ఏం చేయాలో ఈ కథనంలో చూద్దాం.

Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు! 1/9

పాలల్లో పసుపు కలుపుకుని తాగితే బోలెడన్ని ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని గోల్డెన్ మిల్క్‌గా పిలుస్తారు. గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూను పసుపు, చిటికెడు మిరియాలు, కొద్దిగా తేనె లేదా బెల్లం వేసుకుని తాగితే రోగనిరోధక శక్తి బలోపేతమై దగ్గు, జలుబు లాంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.

Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు! 2/9

పసుపు టీ తయారు చేసుకునేందుకు నీటిలో పసుపు, అల్లం, తేనె వేసి మరిగించాలి. ఇది తాగితే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గడంతో పాటు చలితట్టుకునేలా ఒంట్లో ఉష్ణం పుడుతుంది

Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు! 3/9

మీకు నచ్చిన సూపులు లేదా చికెన్ బ్రాత్‌లల్లో కాస్త పసుపు జోడిస్తే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. రుచితో పాటు ఆరోగ్యం కూడా ఇనుమడిస్తుంది

Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు! 4/9

తేనెలో పసుపు కలుపుకుని ఓ డబ్బాలో దాచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఓ టీస్పూను తింటే దగ్గు, గొంతుగరగర, ఇతర సీజనల్ అలర్జీలేవీ దరిచేరవు

Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు! 5/9

అన్నానికి నూనె, పసుపు జత చేసి పసుపు అన్నాన్ని సిద్ధం చేసుకోవచ్చు. దీన్ని ఏదైనా కూరతో తింటే ఆరోగ్యంగా ఉంటారు.

Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు! 6/9

మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూసుల్లో కాస్తంత తేనె, పసుపు కూడా వేసుకుని స్మూతీలు తయారు చేసుకోవచ్చు. వీటితో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది

Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు! 7/9

పసుపు లేకుండా భారతీయ వంటకాలు దాదాపుగా ఉండవనే చెప్పాలి. అయితే, కూరలు చేసుకునేటప్పుడు పసుపు సమృద్ధిగా వేసుకుంటే ఈ కాలంలో ఆరోగ్యం చక్కగా ఉంటుంది.

Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు! 8/9

చలికాలంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పసుపు ఫేస్ మాస్కులు ఎంతో ఉపయోగపడతాయి. దీంతో , చర్మంలో డ్రైనెస్ తగ్గి కాంతులీనుతుంది

Turmeric In Winter: చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు! 9/9

పసుపు జోడించిన గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు మటుమాయం అవుతాయి.

Updated at - Dec 01 , 2024 | 05:26 PM