Summer Tour: వేసవి టూర్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ ప్రదేశాలను అస్సలు మిస్ అవ్వలొద్దు..
ABN, Publish Date - Mar 29 , 2025 | 07:18 AM
వేసవిలో టూర్ ప్లాన్ చేసుకునేవారు అనేక ప్రాంతాలను అన్వేషిస్తుంటారు. అలాంటి వారి కోసం కేరళలోని కొన్ని అందమైన ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కేరళ టూర్ ప్లాన్ చేసుకునే వారు మున్నార్ అనే ప్రాంతాన్ని మాత్రం మిస్ చేయొద్దు. ఇక్కడి అందమైన ప్రదేశాలను చూపరులను కట్టిపడేస్తాయి. చుట్టూ ఎటూ చూసినా అందమైన ప్రదేశాలు మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి.

కేరళలోని అల్లెప్పీ అనే ప్రాంతం కూడా బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. ఈ ప్రాంతాన్ని తూర్పు వెనిస్ అని కూడా పిలుస్తారు. పర్యాటకులకు ఎప్పటికీ మరిచిపోలేని అనుభూతి కలుగుతుంది.

వయనాడ్ కూడా అందమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడి గుహలు, కురువ ద్వీపం, సరస్సులు, వన్యప్రాణలు అభయారణ్యం తదితర ప్రాంతాలు పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందిస్తాయి.

కేరళలోని తేక్కడి ప్రాంతంలోని అందమైన ప్రదేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఇక్కడి పెరియార్ అడవులు భారతదేశంలోని అత్యుత్తమ అందమైన ప్రదేశాల్లో ఒకటిగా నిలిచాయి. అలాగే ఇక్కడి పెరిగియార్ నది, అడవి జంతువులు, వివిధ రకాల పక్షులు కనువిందు చేస్తాయి.

కేరళలోని ప్రధాన నగరాల్లో కొచ్చి ఒకటి. ఇక్కడి ఓడరేవు, బీచ్‌లు, ఫిషింగ్ నెట్స్, మట్టన్చేరి ప్యాలెస్, కొబ్బరి ఉత్పత్తులు తదితరాలు పర్యాటకులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తాయి.
Updated at - Mar 29 , 2025 | 07:18 AM