CM Chandrababu: 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి
ABN, Publish Date - Mar 27 , 2025 | 06:27 PM
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు పరిశీలించారు. అంతకు ముందు పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు పరిశీలించారు.

డయాఫ్రంవాల్ ప్యానళ్ల పనులు పరిశీలించి.. బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు.

పోలవరం క్యాంప్ సైట్‌లో అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.

ప్రాజెక్టు పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు రివ్యూ చేశారు.

పోలవరం డయాఫ్రం వాల్ పనులను సీఎం చంద్రబాబు పరిశీలించారు. పనుల పురోగతిని బావర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు.

అంతకు ముందు పోలవరం చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, జిల్లా నేతలు, అధికారులు స్వాగతం పలికారు.

అనంతరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు.

డయాఫ్రంవాల్ ప్యానళ్ల పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులపై ఆరా తీశారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తొమ్మిది నెలల్లో అనేక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రాజెక్టు గాడిలో పెట్టడానికి చాలా చర్యలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.

పోలవరం రాష్ట్రానికి జీవనాడి అని.. ఈ ఏడాది 4వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని సీఎం చంద్రబాబు చెప్పారు.

వీటిలో కనీసం 400లేదా 500 టీఎంసీల నీరు వాడుకుంటే,ఏపీ కరువు రహిత రాష్ట్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టును 2004లో ప్రారంభించినా, న్యాయపరమైన చిక్కులు వచ్చాయని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు కోసం అప్పుడు, ఇప్పడు చాలా సహకరించిందని సీఎం చంద్రబాబు అన్నారు.

2014నుంచి 2019 వరకు 73 శాతం పనులు చేశామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.

2019 తర్వాత ప్రాజెక్టును చూస్తే చాలా బాధ వేస్తుందని సీఎం చంద్రబాబు చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు పనులను గత జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వం తెలియనితనం, అహంభావం, వివక్షత అన్నీ పోలవరం ప్రాజెక్టును నాశనం చేశాయని సీఎం చంద్రబాబు అన్నారు.

గత జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ వల్ల రూ. 2720 కోట్లు నష్టం వచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Updated at - Mar 27 , 2025 | 06:33 PM