Gudi Sambaralu: అంబరాన్నంటిన గుడి సంబరాలు
ABN, Publish Date - Mar 29 , 2025 | 10:26 PM
ఉగాది పండుగ సందర్భంగా శనివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో హైదరాబాద్ కళాకారులచే పరంపర గుడి సంబరాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రజలు భారీగా తరలి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

ఉగాది పండుగ సందర్భంగా శనివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో హైదరాబాద్ కళాకారులచే పరంపర గుడి సంబరాలు వైభవంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

ప్రాచీన సాంప్రదాయాలు, కళలు, ఆనాటి కాలంలో హిందుత్వం పరిస్థితులు, హిందూత్వాన్ని కాపాడుకునే విధానం, దేవాలయాల విశిష్టత, దేవుళ్ల గొప్పతనం, నాటక రంగంపై ప్రభావం తదితర అంశాలతో కూడిన కళలను కళాకారులు ప్రదర్శించారు.

గుడి సంబరాల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

కార్యక్రమం కోసం వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

పలువురు ప్రముఖులు, ప్రజలు భారీగా తరలి వచ్చి సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

కార్యక్రమంలో ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులు

కళాకారులతో ఫొటోలు దిగడానికి ప్రజలు ఆసక్తి కనబరిచారు.

సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తున్న ప్రముఖులు

ప్రఖ్యాత కళాకారులు తమ శాస్త్రీయ బాణీలతో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

వీరి బృందంలో పలు రకాల ప్రాంతాలకు చెందిన కళాకారులు ఉన్నారు.

ప్రజాప్రతినిధులు, అధికారులు సైతం పరంపర చేస్తున్న సేవలను కొనియాడారు.
Updated at - Mar 29 , 2025 | 10:45 PM