ViralVideo: లీవ్ కావాలంటూ కంపెనీ సీఈఓ వద్దకు వెళ్లిన కొత్త ఉద్యోగి.. చివరకు జరిగిందేంటో చూస్తే..
ABN , Publish Date - Mar 22 , 2024 | 07:33 PM
కిందిస్థాయి ఉద్యోగుల సెలవుల విషయంలో ఓ బాస్ అనుసర్తిస్తున్న వైఖరి చూసి నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: కిందిస్థాయి ఉద్యోగుల సెలవుల విషయంలో ఓ కంపెనీ సీఈఓ వైఖరి చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో ఇతడే నెం1 బాస్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
ఉద్యోగులకు ఊహించని స్వేచ్ఛ ఇస్తూ పని రాబట్టుకుంటున్న ఇతడి పేరు టామ్ హంట్. ఫేమ్ అనే డిజిటల్ మార్కెటింగ్ సంస్థ సీఈఓగా ఉన్నాడు. ఇటీవల తన కింది ఉద్యోగి సెలవు అడిగితే తాను ఏం చేసిందీ అతడు లింక్డ్‌ఇన్‌లో చెప్పుకొచ్చాడు.
Viral: డ్రైవర్ దణ్ణం పెట్టగానే వదిలేసిన ఏనుగు..లేకపోతే వీళ్లు ఏమైపోయేవారో!? షాకింగ్ వీడియో
‘‘ఇటీవల కొత్తగా చేరిన ఓ ఉద్యోగి సెలవు కావాలని వచ్చాడు. వెంటనే నేను ఓకే చెప్పేశా. కానీ, అతడు మాత్రం తాను సెలవు అడగటానికి కారణం చెప్పడం మొదలెట్టాడు. కానీ నేను మాత్రం అతడిని వద్దని వారించాను. ఆ వివరాలన్నీ నాకు అవసరం లేదన్నాను. ‘నిన్ను ఉద్యోగంలోకి తీసుకున్నాక నీకో బాధ్యత అప్పగించా. ఆ పని నువ్వు పూర్తి చేస్తావన్న నమ్మకం నాకుంది’ అని అతడితో అన్నా. 9 టూ 5 మాత్రమే చేస్తానంటే చేయి.. వర్క్ ఫ్రం హోం కావాలన్నా ఓకే. కాస్తంత ముందుగా ఇంటికెళతానన్నా ఒకే. మనందరం మనుషులమే. డెంటిస్ట్ అపాయింట్‌మెంట్ కారణంగా లేటవుతుందని నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమీ ఇక్కడ చేతిలో వాచ్ పట్టుకుని కూర్చోలేదు. వచ్చేపోయే వాళ్ల టైం నోట్ చేసుకోవట్లేదు. నీకిచ్చిన బాధ్యత పూర్తి చేస్తున్నావా, క్లైంట్లు నీ పనితీరుతో హ్యాపీగా ఉన్నారా లేదా అనేదే చూస్తా. ఉద్యోగులకు పనిలో సౌలభ్యమే అందరూ ఫాలో అవ్వాల్సిన విధానం’’ అంటూ టామ్ హంట్ చెప్పుకొచ్చాడు.
ఆయన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అనేక మంది టామ్‌కు జైకొట్టారు. ఇలాంటి బాస్‌లు చాలా తక్కువ మంది ఉంటారంటూ కితాబునిచ్చారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి