Viral Video: ఇదిగో ఇందుకే.. పులులు, సింహాలకు సైతం ఏనుగంటే చచ్చేంత భయం..
ABN , Publish Date - Apr 10 , 2024 | 06:59 PM
అడవి జంతువుల్లో పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులు ఆమడ దూరం పారిపోతుంటాయి. అలాంటి క్రూర జంతువులను సైతం భయపట్టే జంతువులేమైనా ఉన్నాయంటే.. అవి ఏనుగులని చెప్పొచ్చు. ఏనుగులను చూస్తే ఏ జంతువైనా భయంతో వణికిపోవాల్సిందే. వాటిని వేటాడటానికి వెళ్లాలంటే ...
అడవి జంతువుల్లో పులులు, సింహాలను చూస్తే మిగతా జంతువులు ఆమడ దూరం పారిపోతుంటాయి. అలాంటి క్రూర జంతువులను సైతం భయపట్టే జంతువులేమైనా ఉన్నాయంటే.. అవి ఏనుగులని చెప్పొచ్చు. ఏనుగులను చూస్తే ఏ జంతువైనా భయంతో వణికిపోవాల్సిందే. వాటిని వేటాడటానికి వెళ్లాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాయి. ఏనుగుల పవర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక వీడియోలు చూస్తే ఈ విషయం ఇట్టే తెలిసిపోతుంది. తాజాగా, ఓ ఏనుగు వీడియో తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాలోని (South Africa) మలమాలా గేమ్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అడవిలో ఓ పెద్ద ఏనుగుకు (elephant) ఉన్నట్టుండి పిచ్చ కోపం వచ్చినట్లుంది. తన కోపాన్ని ఎలా తీర్చుకోవాలో తెలీక.. చివరకు ఓ పెద్ద చెట్టును టార్గెట్ చేసింది. చెట్టు మొదలు వద్దకు వెళ్లి.. సరిగ్గా పాయిట్ చూసి తొండంతో చెట్టును అటూ ఇటూ కదిపింది. ఇలా క్రమ క్రమంగా చెట్టుపై బలం పెంచుతూ ముందుకూ, వెనక్కూ నెట్టసాగింది.
Viral Video: గోనె సంచిని ఇలాక్కూడా వాడొచ్చా.. ఇతడి డిజైనింగ్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. !
ఇలా పలుమార్లు చెట్టును అటూ ఇటూ ఊపి, చివరకు తన శక్తిని అంతా ఉపయోగించి ఒక్క తోపు తోసేసింది. దీంతో అంత పెట్టు సైతం ఒక్కసారిగా నేలకూలింది. తర్వాత చుట్టు ఆకుల వద్దకు వెళ్లిన ఏనుగు.. వాటిని తీక్షణంగా పరిశీలిచండం వీడియోలో చూడొచ్చు. ఈ ఘటన మొత్తం పర్యాటకుల సమక్షంలోనే జరిగింది. ఏనుగు చేసిన పనికి షాక్ అయిన వారు.. ఈ ఘటనను తమ కెమెరాల్లో బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఏనుగా మజాకా’’.. అంటూ కొందరు, ‘‘భూమిపై అత్యంత శక్తివంతమైన జంతువు ఇదే’’.. అంటూ మరికొందరు, ‘‘వావ్..! వాట్ ఏ పవర్’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఇవి కదా తెలివితేటలు అంటే.. పైనాపిల్స్ సేల్స్ పెంచేందుకు ఇతడు వాడిన టెక్నిక్ తెలిస్తే..