Viral Video: ఏనుగుకు తిక్కరేగితే ఇలాగే ఉంటుంది మరీ.. మొసలిని ఏం చేసిందో చూస్తే..
ABN , Publish Date - Dec 04 , 2024 | 07:20 AM
ఏనుగులు చూసేందుకు ఎంత ప్రశాంతంగా కనిపిస్తాయో.. కొన్నిసార్లు అంతే బీభత్సాన్ని కూడా సృష్టిస్తుంటాయి. అలాంటిది ఇక వాటిని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఏనుగులు ఉన్నట్టుండి పిచ్చిపట్టినట్లు వీధుల్లోకి వచ్చి రచ్చ రచ్చ చేయడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు..
ఏనుగులు చూసేందుకు ఎంత ప్రశాంతంగా కనిపిస్తాయో.. కొన్నిసార్లు అంతే బీభత్సాన్ని కూడా సృష్టిస్తుంటాయి. అలాంటిది ఇక వాటిని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నిసార్లు ఏనుగులు ఉన్నట్టుండి పిచ్చిపట్టినట్లు వీధుల్లోకి వచ్చి రచ్చ రచ్చ చేయడం చూస్తుంటాం. మరికొన్నిసార్లు మిగతా జంతువులపై దాడి చేస్తుంటాయి. ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీరు తాగుతున్న ఏనుగుపై ఓ మొసలి దాడి చేయాలని చూసింది. దీంతో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఏనుగు చెరువులో నీరు తాగేందుకు వెళ్తుంది. అదే సమయంలో ఓ పెద్ద మొసలి ఏనుగుపై ( crocodile tried to attack the elephant) దాడి చేసేందుకు వస్తుంది. ఒక్కసారిగా ఏనుగుపై ఎటాక్ చేస్తుంది. మొసలి దాడి చేయడంతో ఏనుగుకు ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంటుంది. తన బలమైన దంతాలతో మొసలిని నేలకు అదిమిపట్టేస్తుంది.
Viral Video: ఓ వైపు పెళ్లి పెట్టుకుని మరోవైపు మంటపంలోనే ఈ వరుడు చేస్తున్న నిర్వాకం చూడండి..
అంతటితో వదలకుండా తొండంతో మొసలిని అటూ, ఇటూ తిప్పి నేలకేసి కొడుతుంది. ఇలా చాలా సేపు మొసలిపై (elephant attacked a crocodile) దాడి చేస్తుంది. ఏనుగు నుంచి తప్పించుకోవాలని చూసినా మొసలి వల్ల సాధ్యం కాదు. ఇలా చాలా సేపు ఏనుగు ఇలా మొసలిని చావబాదేస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. చూస్తుంటే ఈ దాడిలో ఏనుగు చేతిలో మొసలి ప్రాణాలు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఏనుగుకు కోపం వస్తే ఇలాగే ఉంటుంది’’.. అంటూ కొందరు, ‘‘మొసలికి చుక్కలు చూపించిన మొసలి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 25వేలకు పైగా లైక్‌లు, మిలియన్‌కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చూసేందుకు గేదెల బండే.. కానీ ఇలా కూర్చుకోగానే.. చివరకు ఏమైందో చూడండి..