Share News

Eye Test: ఈ ఫొటోలో ఉన్న సంఖ్యను 15 సెకెన్లలో గుర్తిస్తే మీ కళ్లు చాలా పవర్పుల్ అని ఒప్పుకోవాల్సిందే..

ABN , Publish Date - Oct 22 , 2024 | 03:05 PM

పజిల్స్, తేడాలు కనుక్కోవడం, ఆప్టికల్ ఇస్యూషన్ మొదలైనవన్నీ సాల్వ్ చేయడానికి చాలా సరదాగా అనిపించినా ఇవన్నీ మెదడు పనితీరును, కంటిచూపు సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి.

Eye Test: ఈ ఫొటోలో ఉన్న సంఖ్యను 15 సెకెన్లలో గుర్తిస్తే మీ కళ్లు చాలా పవర్పుల్ అని ఒప్పుకోవాల్సిందే..
Eye Test

సాంకేతికత అభివృద్ది చెందడం వల్ల అన్నీ స్మార్ట్ గా రూపాంతరం చెందాయి. ఒకప్పుడు దినపత్రికలు, వార పత్రికలలో పజిల్స్, పదబంధాలు, తేడాలు కనుక్కోవడం వంటివి వచ్చేవి. ఇప్పుడు వాటికి ధీటుగా ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్ వంటివి డిజిటల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న పొటో కూడా ఆ కోవకు చెందినదే. మెదడుకు, కళ్లకు పని పెట్టే ఈ ఫొటో గురించి తెలుసుకుంటే..

జుట్టు చిట్లుతోందా.. అసలు కారణాలు ఇవే..


పజిల్స్ పూర్తీ చేయడం, తేడాలు కనుక్కోవడం, ఒక ఫొటోలో మరిన్ని చిత్రాలను కనిపెట్టడం, ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీజర్ వంటివి చేయడం వల్ల మెదడు పదునెక్కుతుంది. ఆలోచనాతీరు మెరుగవుతుంది. ఎర్రని కార్పెట్ పరిచినట్టు ఉన్న ఈ ఫొటోలో ఒక సంఖ్య దాగుంది. చురుకైన కంటి చూపు, వేగంగా పనిచేసే మెదడు ఉన్నవారు దీన్ని సులువుగానే గుర్తించగలరు, కానీ మెదడు పనితీరు, కంటి చూపు బలహీనంగా ఉన్నవారు మాత్రం కష్టపడాల్సి వస్తోంది. కేవలం 15 సెకెన్లలో ఈ సంఖ్యను గుర్తిస్తే మాత్రం కంటి చూపు అద్భుతంగా ఉన్నట్టే..

number1.jpg

ఈ ఫొటో ట్విట్టర్ ఎక్స్ లో Pro Brain Teaser అనే హ్యాండిల్ తో పోస్ట్ చేయబడింది. ఈ ఫొటోను చూసిన చాలామంది వివిధ రకాలుగా స్పందించారు. ఇందులో సంఖ్యను గుర్తించడం కంటే ఇది తమకు ఎలా ఉపయోగపడిందో చెప్పినవారు ఎక్కువ ఉన్నారు. "ఇది మెదడుకు చిన్న వ్యాయామం లాంటిది" అని ఒకరు స్పందిస్తే.. "నేను ఈ పజిల్ ను ఇష్టపడుతున్నాను, ఇవి మెదడుకు పని పెట్టడమే కాకుండా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడతాయి" అని మరొకరు అన్నారు. మీ కంటి చూపు పదునెంతో మీరు కూడా ఫొటోలో సంఖ్యను 15 సెకెన్లలో కనిపెట్టి ఫ్రూవ్ చేసుకోండి మరి.

ఇవి కూడా చదవండి..

తెలంగాణలో ఈ గ్రామాల అందం చూస్తే ఫిదా అవుతారు..

Blueberry Vs Amla: బ్లూ బెర్రీ లేదా ఉసిరి.. చర్మ ఆరోగ్యానికి ఏ పండు అద్భుతంగా పనిచేస్తుంది..

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Oct 22 , 2024 | 03:06 PM