CPI: దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తున్నారు: కె.నారాయణ
ABN , Publish Date - Dec 22 , 2024 | 07:25 AM
సినిమాకు పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల మోరను ఆలకిస్తారా.. పుష్పా సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి థియేటర్‌లో కూర్చిని చూడగలమా.. ‘లేస్తే ఒకసారి , కూరుచుంటి ఒకసారి ’ అనే చీపు సంభాషణలు ఏ కళకు నిదర్శనమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.
అమరావతి: స్మగ్లర్స్ వ్యవస్థకు, ముఖ్యంగా ఎర్రచందనం స్మగ్లింగ్ (Red sandalwood smuggling) లాంటి క్రూరమయిన దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తున్నారని, హింసాయుత నేర ప్రవృత్తిని ‘తగ్గేది లేదు’ అని డైలాగులు కొడుతూ ప్రోత్సహించి, హీరో వర్షిప్‌ను యువకులలో కల్పించేవిధంగా ‘పుష్ప’ సినిమా (Pushpa Movie)ను తీశారని సీపీఐ జాతీయ కార్యదర్శి (CPI Leader) కె.నారాయణ (K.Narayana) తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ సందర్భంగా అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అ బడుద్ధాయి సినిమాకు రాయతీలు ప్రకటింటి ప్రజలపై భారం మోపడానికి నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం అసలు మొదటి ముద్దాయి అని అన్నారు. ఏదైనా సందేశాత్మక చిత్రానికి రాయితీలివ్వవచ్చునని.. ఎందుకంటీ ఈ అమాయక ప్రజలు అలాంటి సినిమాలకు ఆదరణ యివ్వరని అన్నారు.
సినిమాకు పెట్టుబడి ఎక్కువయిందని కోట్లకు పడగ లెత్తే ఆసాముల మోరను ఆలకిస్తారా.. పుష్పా సినిమాను సభ్యతతో కూడిన కుటుంబాలు కలసి థియేటర్‌లో కూర్చిని చూడగలమా.. ‘లేస్తే ఒకసారి , కూరుచుంటి ఒకసారి ’ అనే వ్యంగ్య సంభాషణలు ఏ కళకు నిదర్శనమని నారాయణ ప్రశ్నించారు. ప్రముఖ సినిమా ఆదర్శ నటులు ‘అల్లు’ తరం వారు ఇటువంటి సినిమాలు తీసి ప్రోత్సహించడమా.. అని నిలదీశారు. మాతృమూర్తి నవమాసాలు మోసి కన్న తల్లి తన ప్రాణాలను లెక్కచేయకుండా తన పుత్రరత్నాన్ని కాపాడుకోడానికి తెగించి ఆమె బలై పోతే.. అందులో ఆమె సినిమా చూడడానికి టికెట్లు కొనుక్కొని వచ్చిందే తప్ప హీరోను చూడడానికి రాలేదని అన్నారు. చౌకబారు ప్రచారానికి సినిమా వాళ్లు పాల్పడవచ్చేమోగాని.. రాజకీయ నాయకులు అంత కక్కుర్తి పడాలా.. అని ప్రశ్నించారు. సభ్యసమాజం సిగ్గుతో తలవంచి తీవ్రంగా ఖండించాలని పిలుపిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రగతిశీల కళాకారులు, సాహితీవేత్తలు, సామజిక స్పృహ వున్నవాళంతా ముక్త కంఠంతో ఖండించాలన్నారు. బాధితకుటుంబానికి పుష్ప యాజమాన్యం యిచ్చే ముదనష్టపు ఆర్థికసాయాన్ని తిరస్కరించాలని సూచించారు. ప్రభుత్వం , సభ్యసమాజం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా నని, త్వరలో మావంతు సహాయం ప్రకటిస్తానుని నారాయణ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వాళ్లతో జగన్ రాజీనామా చేయించాలి..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News