Perni Nani: పేర్ని నాని కేసులో ఊహించని మలుపు
ABN , Publish Date - Dec 22 , 2024 | 07:30 AM
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల్లో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో పేర్ని నాని, చిక్కుకున్నారు.
కృష్ణాజిల్లా, మచిలీపట్నం : వైఎస్సార్‌సీపీ నేత (YSRCP Leader), మాజీ మంత్రి (Former Minister) పేర్ని నాని (Perni Nani), అతని కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికి చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా తండ్రీకొడుకులు ఇద్దరికీ నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇచ్చేందుకు పేర్ని నాని ఇంటికి పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో ఇంటి తలుపులకు పోలీసులు నోటీసులు అంటించారు.
ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ, ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ ఉన్నారు. కేసు దర్యాప్తునకు సహకరించాలని పోలీసులు నోటీసుల్లో కోరారు. మధ్యాహ్నం 2గంటల్లోపు స్టేషన్‌కు వచ్చి వాస్తవ విషయాలు చెప్పాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. మరోపక్క ఈ కేసులో నిందితులుగా నాని సతీమణి జయసుధ ఉన్నారు. పీఏ మానస తేజ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. A2 మానస తేజ కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిచి పోలీసులు విచారిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల్లో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. కృష్ణాజిల్లా బందరులో కోటి రూపాయల రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో పేర్ని నాని చిక్కుకున్నారు. రేషన్ బియ్యం మాయంపై పేర్నినాని సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శిపై కూడా కేసు నమోదైంది. జగన్ ప్రభుత్వ హయాంలో నాని సతీమణి పేరిట గోడౌన్ నిర్మించి సివిల్ సప్లయిస్‌కు అద్దెకు ఇచ్చారు. ఆ క్రమంలోనే పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి
CPI: దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తున్నారు: కె.నారాయణ
Mystery Unfolds : మరిదే సూత్రధారి!
Read Latest AP News and Telugu News