Viral: తల్లి ఇంట్లో లేకపోతే ఇంతే.. పిల్లలను రిస్క్‌లో పడేసిన తండ్రి!
ABN , Publish Date - Sep 16 , 2024 | 07:49 PM
ఏటవాలుగా ఉన్న మైదానంలో పిల్లలు ట్రాలీలో కూర్చుని కిందకు వేగంగా దూసుకొచ్చి ఓ చెట్టును ఢీకొట్టిన వీడియో వైరల్ అవుతోంది. తల్లి ఇంట్లో లేకపోతే పిల్లలు ఇలాంటి రిస్కుల్లో పడతారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతుంది తల్లి. వారికి ఎటువంటి అపాయం రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. చిన్న చిన్న విషయాలపై కూడా పూర్తి శ్రద్ధపెట్టి బిడ్డలను సాకుతుంది. తండ్రికి కూడా పిల్లలపై అంతటి ప్రేమ ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అయితే, తండ్రి రూట్ కాస్త డిఫరెంట్. తండ్రులు తమ పిల్లల విషయంలో కాస్తంత స్వేచ్ఛగా ఉంటారు. వారితో కలిసి ఆటలాడతారు. పిల్లలను నవ్వించేందుకు అప్పుడప్పుడూ కాస్తంత రఫ్ అండ్ టఫ్‌గా మారతారు. చిన్న చిన్న రిస్కులు కూడా చేస్తుంటారు. ఇద్దరు పిల్లల విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ (Viral) అవుతూ జనాలు షాకయ్యేలా చేస్తోంది.
Viral: అప్పులోళ్లకు రైతు బిడ్డ షాక్! లోన్ కట్టలేదని ట్రాక్టర్ తీసుకెళుతుంటే..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఇద్దరు చిన్న పిల్లలు బొమ్మ ట్రాలిలో కూర్చుని ఏటవాలుగా మైదానంపై జారుతూ కిందవెళ్లారు. ట్రాలీలో వేగంగా వెళ్లడం చిన్నారులకు నచ్చడంతో కేరింతలు కొట్టారు. ఎదురుగా ఉన్న తండ్రిని పిలుస్తూ..‘ డాడీ.. చూడు మేము ఎంత వేగంగా వెళుతున్నామో’ అని సంబరపడుతూ చెప్పారు. తండ్రేమో పిల్లల సంబరాన్ని వీడియోలో రికార్డు చేయసాగాడు (Kids Epic Downhill Trolley Ride Ends In Hilarious Disaster While Dad Laughs).
Viral: రోజూ స్నానం చేయని భర్త! విసుగెత్తిపోయిన భార్య ఏం చేసిందంటే..
అక్కడ వరకూ బాగానే ఉన్నా ఆ తరువాత సీన్లో అసలు ట్విస్టు చోటుచేసుకుంది. ట్రాలీలో వేగంగా దూసుకెళుతున్న పిల్లలు దూరాన ఉన్న ఓ చెట్టును ఢీకొట్టి పక్కకు పడిపోయారు. అయితే, దెబ్బలేమీ తగలకపోవడంతో పిల్లలు నవ్వుతూ వారంతట వారే పైకి లేచారు. తండ్రి మాత్రం యథాతథంగా దూరం నుంచి నిలబడి ఇదంతా రికార్డు చేశారు.
Sunita Williams: అంతరిక్షం నుంచి ఓటు వేయనున్న సునీతా విలియమ్స్! ఇదెలా సాధ్యమంటే..
ఇక వీడియో చూసిన నెటిజన్లు వేల కొద్దీ కామెంట్స్ కురిపించారు. తల్లి ఇంట్లో లేకపోతే తండ్రికి పట్టపగ్గాలు ఉండవని కొందరు అభిప్రాయపడ్డారు. పిల్లలతో రఫ్ అండ్ టఫ్ ఆటలు ఆడుతూ వారిలో మమేకమైపోతారని కామెంట్ చేశారు. పిల్లలకు జీవితంలో ఇదో మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఓ వ్యక్తి అన్నాడు. ముసలితనంలో కూడా వారీ రోజులను గుర్తు చేసుకుని మరీ నవ్వుకుంటారని అన్నారు.
Viral: ఈ రక్తం ధర లీటరుకు రూ.12 లక్షలు! ఇంత ఖరీదు ఎందుకో తెలిస్తే..
కొందరు మాత్రం ఆ పిల్లల తండ్రిని సున్నితంగా విమర్శించారు. పిల్లలతో కాస్తంత సాహసభరిత ఆటలు ఆడించడం సబబే కానీ మరీ ఇలాంటి రిస్కులు చేయకూడదని అన్నారు. ట్రాలీ మరి కాస్త వేగంగా వెళ్లి ఉంటే ఆ పిల్లలకు దెబ్బలు తగిలి ఉండేవని, ఆ తండ్రిలో పిల్లల పట్ల కాస్తంత నిర్లక్ష్యం కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.
Viral: విమానం ఎంట్రీ డోర్స్ ఎడమ వైపే ఎందుకుంటాయో తెలుసా?