Tourism: లక్షద్వీప్ వెళ్తున్నారా.. టిక్కెట్ ధరలు.. ట్రిప్ వివరాలివిగో
ABN , Publish Date - Jan 10 , 2024 | 06:14 PM
సోషల్ మీడియాలో #boycottmaldives అనే హ్యాష్ ట్యాగ్ తో పాటు #Lakshadweep అనే ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఏ క్షణాన ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించారో.. అప్పటి నుంచి ఆ దీవి గురించి వెతికే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రధాని పర్యటన తరువాత మాల్దీవులకు భారత్ కు మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.
ఢిల్లీ: సోషల్ మీడియాలో #boycottmaldives అనే హ్యాష్ ట్యాగ్ తో పాటు #Lakshadweep అనే ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. ఏ క్షణాన ప్రధాని మోదీ లక్షద్వీప్ లో పర్యటించారో.. అప్పటి నుంచి ఆ దీవి గురించి వెతికే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రధాని పర్యటన తరువాత మాల్దీవులకు భారత్ కు మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. భారతీయులందరూ ఇప్పుడు లక్షద్వీప్ కోసం తెగ వెతికేస్తున్నారు. అక్కడ టూరిజం ఎలా ఉంటుంది, టిక్కెట్ ధరలేంటి వంటి ప్రశ్నలు వేసుకుంటున్నారు. MakeMyTrip ట్రావెల్ అగ్రిగేటర్ లో 3వేల శాతం ఎక్కువ వెతికిన పదంగా లక్షద్వీప్ నిలిచింది. అరేబియా సముద్రంలో ఉన్న లక్షద్వీప్‌కి వెళ్లాలనుకునేవారికి ఉపయోగపడే ట్రిప్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ-అగట్టి విమానాలు
ఢిల్లీ నుండి విమానాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ ఫ్లైట్ ఎక్కాక కేరళలోని కొచ్చిలో ఆగాలి. ఎందుకంటే అగట్టి విమానాశ్రయానికి అవుట్‌బౌండ్ విమానాలు ఉన్న ఏకైక విమానాశ్రయం కొచ్చిలో ఉంది.
ప్రయాణ సమయం
ఢిల్లీ నుండి అగట్టికి విమానంలో ప్రయాణించడానికి మార్గంలో స్టాప్‌ల సంఖ్యను బట్టి 12 నుంచి 25 గంటల సమయం పట్టవచ్చు.
టికెట్ ఛార్జీ
మేక్‌మైట్రిప్ ప్రకారం, ఢిల్లీ నుండి అగట్టికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ టికెట్ (వన్-వే) ధర సుమారుగా ₹ 12 వేలుగా ఉంది. అయితే, ప్రయాణ తేదీల ఆధారంగా ధరలు మారవచ్చు. ఒక నెల ముందుగానే బుక్ చేసుకుంటే టికెట్ ధర తగ్గుతుంది.
విమాన టిక్కెట్‌లపై ఆఫర్‌లు
MakeMyTrip ప్రోమో కోడ్‌ల ద్వారా 10% వరకు తగ్గింపులను అందిస్తోంది. టికెట్ ధర రూ.12 వేలు ఉంటే ప్రోమోకోడ్ ద్వారా రూ.10వేలకు తగ్గించవచ్చు. అయితే ఈ ఆఫర్ మొదటి ఫ్లైట్ బుకింగ్‌కి మాత్రమే వర్తిస్తుంది.
కనీసం ముగ్గురు ప్రయాణీకులకు టిక్కెట్లు బుక్ చేస్తే బోనస్ కూపన్ ద్వారా రూ.2,500 ఆదా చేయవచ్చు. అగట్టిలో నుంచి లక్షద్వీప్ లో ఉన్న ఇతర దీవులను సందర్శించడం చాలా సులభం. పర్యాటకులను ఒక ద్వీపం నుండి మరొక ద్వీపానికి తీసుకెళ్లడానికి సముద్ర పడవలు, హెలికాప్టర్లు ఉన్నాయి.