Auto Accident Viral Video: కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదే.. ఈ ఆటో డ్రైవర్ నిర్వాకానికి.. చివరకు షాకింగ్ ట్విస్ట్..
ABN , Publish Date - Mar 27 , 2025 | 11:48 AM
ఓ వ్యక్తి ఆటోను పార్కింగ్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి తీసుకెళ్తుంటాడు. అయితే ఆటో ఎదురుగా ఓ సైకిల్ పార్క్ చేసి ఉంటుంది. అడ్డుగా ఉన్న సైకిల్‌ను.. కిందకు దిగి పక్కకు తీయాల్సింది పోయి.. చేత్తో పక్కకు నెట్టేస్తాడు. ఈ ఘటనలో చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

మనం చెసే మంచి, చెడులను బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మంచి చేస్తే మనకూ మంచే జరుగుతుంది. అలాగే చెడు చేయాలని చూస్తే చివరకు మనకూ అదే జరుగుతుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ చేసిన పనికి.. చివరకు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘కర్మ ఈజీ బ్యాక్ అంటే ఇదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి ఆటోను పార్కింగ్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసి తీసుకెళ్తుంటాడు. అయితే ఆటో ఎదురుగా ఓ సైకిల్ పార్క్ చేసి ఉంటుంది. అడ్డుగా ఉన్న సైకిల్‌ను.. కిందకు దిగి పక్కకు తీయాల్సింది పోయి.. చేత్తో పక్కకు నెట్టేస్తాడు.
Viral Video: ఇది కదా లైవ్ మ్యూజిక్ అంటే.. ఈ గిటారిస్ట్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
తర్వాత ఆటోను నిర్లక్ష్యంగా నడిపి సైకిల్ టైరుపై ఎక్కిస్తాడు. చివరకు చేసేదేమీలేక ఆటో నుంచి కిందకు దిగి, సైకిల్‌ను పక్కకు తీస్తాడు. అయితే ఇలా సైకిల్‌ను పక్కకు తీయగానే.. ఆటో నేరుగా ముందుకు దూసుకెళ్లిపోతుంది. దీంతో షాకైన ఆ వ్యక్తి ఆటోను ఆపాలని చూసినా వీలుకాదు. వేగంగా ముందుకు దూసుకెళ్లిన ఆటో చూస్తుండగానే.. (Auto falls into Valley) రోడ్డు పక్కన గుంతలో పడిపోతుంది. సైకిల్‌ను డ్యామేజ్ చేసిన కొద్ది క్షణాల్లోనే తన ఆటో కూడా ప్రమాదానికి గురవడంతో అతను ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
Viral Video: చూసేందుకు పిచ్చివాడైనా.. చేసిన పని చూస్తే.. శభాష్ అనాల్సిందే..
ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కర్మ ఈజ్ బ్యాక్ అంటే ఇదే’’.. అంటూ కొందరు, ‘‘చేసిన పాపం ఊరికే పోదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 28 వేలకు పైగా లైక్‌లు , 8.69 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: టెంట్ కింద పంట కోత.. వీళ్ల తెలివి మామూలుగా లేదుగా..
ఇవి కూడా చదవండి..
Monkey Viral Video: తల్లి ప్రేమకు నిలువెత్తు నిదర్శనం.. ఈ కోతి చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..
Tricks Viral Video: సబ్బు వేస్ట్ అవుతోందా.. ఈమె చేసిన ట్రిక్ చూస్తే ఆశ్చర్యపోతారు..
Marriage Funny Video: వరుడి కొంపముంచిన యువతి.. వధువు ఎదుటే కౌగిలించుకోవడంతో.. చివరకు..