Share News

Viral Video: వామ్మో.. ఇతనెక్కడి జాంబీ టీచర్.. పిల్లలకు పాఠాలు ఎలా చెబుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..

ABN , Publish Date - Oct 02 , 2024 | 03:10 PM

సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం జనాలు రకరకాల వేషాలు వేస్తున్నారు. ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి వ్యూస్, లైక్స్ సంపాదించడమే ధ్యేయంగా బతుకుతున్నారు. తాజాగా ఈ కోవలోకి ఓ టీచర్ కూడా చేరాడు.

Viral Video: వామ్మో.. ఇతనెక్కడి జాంబీ టీచర్.. పిల్లలకు పాఠాలు ఎలా చెబుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..
teacher acting weirdly in class room

సోషల్ మీడియా (Social Media) అందరికీ ఎంతో వినోదాన్ని అందిస్తోంది. కొందరు సోషల్ మీడియా ద్వారా ఎంటర్‌టైన్ అవుతుంటే, మరికొందరు అదే మాధ్యమం ద్వారా పాపులర్ అవుతున్నారు. అలా పాపులారిటీ సంపాదించడం కోసం రకరకాల వేషాలు వేస్తున్నారు. ప్రాణాంతక సాహసాలు చేస్తున్నారు. విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఏదో ఒకటి చేసి వ్యూస్, లైక్స్ సంపాదించడమే ధ్యేయంగా బతుకుతున్నారు. తాజాగా ఈ కోవలోకి ఓ టీచర్ (Teacher) కూడా చేరాడు. అతడు క్లాస్‌రూమ్‌లో (Classroom) విచిత్రంగా పాఠాలు చెబుతూ వైరల్ అయ్యేందుకు ప్రయత్నించాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@veejuparmar అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని వ్యక్తి ఓ ఫిజిక్స్ టీచర్ (Physics Teacher). అతడు క్లాస్‌రూమ్‌లో పిల్లలకు ఫిజిక్స్ పాఠం బోధిస్తున్నాడు. బోర్డు మీద రాసిన తర్వాత వెనక్కి తిరిగి హఠాత్తుగా విచిత్రంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. విద్యార్థుల వైపు తిరిగి వింత శబ్దాలు చేయడం ప్రారంభించాడు. కొన్నిసార్లు నవ్వుతూ, కొన్నిసార్లు అరుస్తూ, కొన్నిసార్లు మొహంపై రుద్దుకుంటూ భయపెడుతున్నాడు. అతడు కావాలని అలా చేస్తున్నాడో, అతడికేమైనా అయిందో ఆ వీడియో చూసిన వారికి అర్థం కావడం లేదు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 58 వేల మంది వీక్షించారు. వందల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ``అతడిని న్యూటన్ ఆత్మ ఆవహించిందేమో``, ``ఫిజిక్స్ లెక్చరర్ల పరిస్థితి ఒక్కోసారి అలాగే ఉంటుంది``, ``అతడు క్వంటమ్ ఫిజిక్స్ చెబుతున్నట్టున్నాడు``, ``అతడు యాక్టర్ కాబోయి టీచర్ అయినట్టున్నాడు``, ``ఫిజిక్స్ క్లాస్ ఎప్పుడూ హారర్ సినిమాలాగే ఉంటుంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: నర్సరీ టీచర్ల అంకిత భావానికి హ్యాట్సాఫ్.. ఫన్నీ టమాటా రైమ్ వీడియో వైరల్..


Viral: చక్కగా నిద్రపోయింది.. ఏకంగా రూ.9 లక్షలు గెలుచుకుంది.. అసలు పోటీ ఏంటంటే..


Viral Video: రోడ్డు పక్కన ఎలుగుబంటి.. కారులో వెళ్తున్న వారికి ఎలాంటి షాకిచ్చిందో చూడండి.. వీడియో వైరల్..


Viral Video: బలం ఉందని విర్రవీగితే ఇంతే.. చీమల దెబ్బకు కొండచిలువ పరిస్థితి ఏమైందో చూడండి.. వీడియో వైరల్..


Optical Illusion: మీ అబ్జర్వేషన్ స్కిల్స్‌కు టెస్ట్.. ఈ రెండు ఫొటోల్లోని తేడాలను 10 సెకెన్లలో పట్టుకోండి..



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Oct 02 , 2024 | 03:10 PM