Viral Video: నర్సరీ టీచర్ల అంకిత భావానికి హ్యాట్సాఫ్.. ఫన్నీ టమాటా రైమ్ వీడియో వైరల్..
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:23 PM
ఎలా చెబితే పిల్లల మనస్సులలోకి ఎక్కుతుందో టీచర్లు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు టీచర్ల శ్రమకు ముగ్ధులై వారిపై ప్రశంసలు కురిపించారు. ఉపాధ్యాయుల కృషి, సృజనాత్మకతను అభినందిస్తున్నారు.
పిల్లలకు రైమ్స్ నేర్పించడానికి టీచర్లు (Teachers) పడే ప్రయాస అంతా ఇంతా కాదు. చక్కగా పాటలు, ఆటల రూపంలో పిల్లలకు నేర్పడానికి టీచర్లు ముందుగా ఎంతో ట్రైనింగ్ తీసుకుంటారు. ఎలా చెబితే పిల్లల (Students) మనస్సులలోకి ఎక్కుతుందో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు టీచర్ల శ్రమకు ముగ్ధులై వారిపై ప్రశంసలు కురిపించారు. ఉపాధ్యాయుల కృషి, సృజనాత్మకతను (Creativity) అభినందిస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోను ఓ క్లాస్‌రూమ్‌లో చిత్రీకరించారు. drnitinshakya_sdm అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ``ఆహా టమాటా బడే ఫంగీ`` అనే రైమ్‌ను పిల్లలకు నేర్పే ముందు టీచర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. చక్కగా పాడుతూ, ఆ రైమ్‌కు అనుగుణంగా టీచర్లు డ్యాన్స్ కూడా చేస్తున్నారు. వారికి మరో ఇద్దరు శిక్షణ ఇస్తున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు లక్షల మంది వీక్షించారు. 50 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.
ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. టీచర్ల శ్రమ, నిబద్ధతను కొనియాడుతున్నారు. ``మన కాలంలో అలాంటి ఉపాధ్యాయులు ఎందుకు లేరు? ``, ``విద్యలో సృజనాత్మకత ఎంత ముఖ్యమో ఈ నర్సరీ టీచర్ల ఈ ప్రయత్నం నిరూపిస్తోంది``, ``టీచర్లు ఏదైనా ఇంత ఆహ్లాదకరంగా చెప్పినప్పుడు, అది పిల్లలకు చక్కగా అర్థమవుతుంది``, ``ఆ రైమ్‌ను పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరు`` అంటూ నెటిజన్లు కామెంట్ల రూపంలో ఈ టీచర్లను ప్రశంసిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral: చక్కగా నిద్రపోయింది.. ఏకంగా రూ.9 లక్షలు గెలుచుకుంది.. అసలు పోటీ ఏంటంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..