Viral Video: నిజంగా.. వీళ్లసలు తల్లిదండ్రులేనా? వాళ్లు బైక్ మీద కూర్చుని పిల్లాడిని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి..
ABN , Publish Date - Apr 17 , 2024 | 03:45 PM
తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలు ఎప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లలంటే తల్లిదండ్రులకు ఉండే ప్రేమకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తల్లిదండ్రులు (Parents) తమ పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పిల్లలు (Child) ఎప్పుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటారు. పిల్లలంటే తల్లిదండ్రులకు ఉండే ప్రేమకు సంబంధించిన వీడియోలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అందుకు పూర్తి విరుద్ధమైన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు తల్లిండ్రులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు (Viral Video).
వైరల్ అవుతున్న ఆ వీడియోను బెంగళూరు (Bengaluru)లో చిత్రీకరించారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో తల్లిదండ్రులు ఇద్దరూ స్కూటీ మీద కూర్చుని వెళ్తున్నారు. వారి కొడుకును మాత్రం ప్రమాదకరంగా ఫుట్ రెస్ట్పై నిల్చోబెట్టి తీసుకెళ్తున్నారు. బిజీ రోడ్డు మీద ప్రయాణిస్తూ చిన్న కుర్రాడిని అలా తీసుకెళ్లడం చాలా మందికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఏ మాత్రం తేడా వచ్చినా చాలా పెద్ద ప్రమాదం జరుగుతుందని, వారు చాలా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారుని వీడియో తీసిన వ్యక్తి కామెంట్ చేశారు.
@Lollubee అనే ట్విటర్ హ్యాండిల్లో ఈ వీడియో షేర్ అయింది. ఇప్పటివరకు ఈ వీడియోను 1.8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``బ్రదర్.. ఇద్దరు పిల్లలతో ప్రయాణించటపుడు చాలా మంది ఇలాగే చేస్తారు. అనవసరంగా ఎక్కువ స్పందించకండి``, ``ఓ మైగాడ్``, ``బెంగళూరు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి``, ``కారు కొనే స్థోమత లేని వారికి ఇలాంటివి తప్పవు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ ట్రిక్ ఏదో బాగుందే.. గిన్నెలను కడిగేందుకు నీరు లేక ఓ వ్యక్తి ఎలా తింటున్నాడో చూడండి..
Viral Video: వామ్మో.. పులితో ఆటంటే ఇలా ఉంటుందా? ఒళ్లు గగుర్పొడిచే వీడియో చూడండి..!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..