Share News

కోహ్లీనా.. అతడెవరు?

ABN , Publish Date - Jul 12 , 2024 | 05:22 AM

ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ కలిగిన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ. రొనాల్డో, మెస్సీ తరహాలోనే ఇన్‌స్టాలో అతడికి కూడా కోట్లాదిమంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే, స్వీడన్‌ లెజెండరీ ఫుట్‌బాలర్‌ జ్లటాన్‌ ఇబ్రహిమోవిచ్‌కు కోహ్లీ ఎవరో

కోహ్లీనా.. అతడెవరు?

స్వీడన్‌ సాకర్‌ స్టార్‌ ఇబ్రహిమోవిచ్‌

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ కలిగిన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ. రొనాల్డో, మెస్సీ తరహాలోనే ఇన్‌స్టాలో అతడికి కూడా కోట్లాదిమంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే, స్వీడన్‌ లెజెండరీ ఫుట్‌బాలర్‌ జ్లటాన్‌ ఇబ్రహిమోవిచ్‌కు కోహ్లీ ఎవరో కూడా తెలియదట. అమెరికాకు చెందిన ప్రఖ్యాత యూట్యూబర్‌ స్పీడ్‌తో ఇంటర్వ్యూలో విరాట్‌ ఫొటోను చూపినా గుర్తుపట్టలేకపోయాడు. ‘ఈ క్రికెటర్‌ను ఎప్పుడూ చూడలేదు. అస్సలు నాకు క్రికెట్టే తెలీదు. అతడు గొప్ప ఆటగాడా?’ అని ప్రశ్నించాడు.

Updated Date - Jul 12 , 2024 | 05:22 AM