Jasprit Bumrah: చరిత్ర సృష్టించిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఆ ఘనత సాధించిన మొట్టమొదటి బౌలర్
ABN , First Publish Date - 2024-02-07T15:21:08+05:30 IST
కొన్ని సంవత్సరాల నుంచి భారత క్రికెట్ జట్టుకి ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జస్‌ప్రీత్ బుమ్రా తాజాగా సంచలన రికార్డ్ నెలకొల్పాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో.. టీ20, వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి బౌలర్‌గా బుమ్రా చరిత్రపుటలకెక్కాడు.
కొన్ని సంవత్సరాల నుంచి భారత క్రికెట్ జట్టుకి ప్రధాన పేసర్‌గా కొనసాగుతున్న జస్‌ప్రీత్ బుమ్రా తాజాగా సంచలన రికార్డ్ నెలకొల్పాడు. ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో అతడు అగ్రస్థానానికి ఎగబాకాడు. దీంతో.. టీ20, వన్డే, టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకున్న మొట్టమొదటి బౌలర్‌గా బుమ్రా చరిత్రపుటలకెక్కాడు. అంతేకాదు.. టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న తొలి భారత పేసర్‌గానూ అతడు సరికొత్త రికార్డ్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇంతకుముందు టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా మూడో స్థానంలో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉండేవాడు. అయితే.. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో బుమ్రా అద్భుత ప్రదర్శనతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ బ్యాటింగ్ పతనాన్ని శాసించిన బుమ్రా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తూ మూడు వికెట్లు తీశాడు. అంటే.. రెండో టెస్టులో మొత్తం తొమ్మిది వికెట్లతో అతడు తాండవం చేశాడు. అందుకే.. అతడు టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. గతంలో వన్డే, టీ20 ఫార్మాట్‌లలో అగ్రస్థానాన్ని బుమ్రా సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌లో తొలి స్థానాన్ని అందుకోవడం ఇదే మొదటిసారి. ఈ దెబ్బకు అశ్విన్ మూడో స్థానానికి పడిపోగా.. కగిసో రబాడ రెండో ప్లేస్‌లో ఉన్నాడు.
కాగా.. బుమ్రా కంటే ముందే ముగ్గురు భారత స్పిన్నర్లు టెస్టుల్లో టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. వాళ్లే.. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బిషన్ బేడీ. పేసర్లలో ట్యాంప్ ర్యాంక్‌ని సొంతం చేసుకున్న తొలి పేసర్ బుమ్రానే అయినా.. ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం ఈ ఘనత సాధించిన నాలుగో భారత బౌలర్‌గా అతడు నిలిచాడు. ఇక ఏషియన్ ప్లేయర్ల జాబితా విషయానికొస్తే.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గతంలోనే మూడు ఫార్మాట్లలో నంబర్ వన్ ర్యాంక్‌ను అందుకున్నాడు. అతని తర్వాత రెండో భారత ప్లేయర్‌గా బుమ్రా ఈ ఘనత సాధించాడు.