ఆఖరి నిమిషంలో వాట్కిన్స్ వండర్ గోల్
ABN , Publish Date - Jul 12 , 2024 | 05:32 AM
ఓల్లీ వాట్కిన్స్ ఆఖరి నిమిషం గోల్‌తో.. ఇంగ్లండ్ వరుసగా రెండోసారి యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌ప్స ఫైనల్‌కు చేరుకొంది. బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీ్‌సలో ఇంగ్లండ్ 2-1తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ ఆరంభమైన 7వ నిమిషంలోనే నెదర్లాండ్స్ గోల్
‘యూరో’ ఫైనల్లో ఇంగ్లండ్
2-1తో నెదర్లాండ్స్‌పై గెలుపు
డార్ట్‌మండ్: ఓల్లీ వాట్కిన్స్ ఆఖరి నిమిషం గోల్‌తో.. ఇంగ్లండ్ వరుసగా రెండోసారి యూరో ఫుట్‌బాల్ చాంపియన్‌షి్‌ప్స ఫైనల్‌కు చేరుకొంది. బుధవారం రాత్రి జరిగిన రెండో సెమీ్‌సలో ఇంగ్లండ్ 2-1తో నెదర్లాండ్స్‌ను ఓడించింది. ఆదివారం జరిగే టైటిల్ ఫైట్‌లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ ఆరంభమైన 7వ నిమిషంలోనే నెదర్లాండ్స్ గోల్ చేసి షాకిచ్చింది. 40 మీటర్ల దూరం నుంచి గవీ సైమన్ కొట్టిన కిక్.. బుల్లెట్‌లా గోల్‌లోకి దూసుకెళ్లింది. అయితే, 11 నిమిషాల తర్వాత పెనాల్టీ ఏరియాలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్‌ను డెంజిల్ మొరటుగా అడ్డుకోవడంతో రెఫరీ పెనాల్టీ కిక్ ఇచ్చాడు. దీన్ని కేన్ గోల్‌గా మలచడంతో స్కోరు 1-1తో సమమైంది. అయితే, సెకండా్‌ఫలో ఇరుజట్లకూ చక్కని అవకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేక పోయాయి. మ్యాచ్ అదనపు సమయం దిశగా సాగుతున్న దశలో కేన్ బదులు సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన వాట్కిన్స్ 90వ నిమిషంలో కళ్లుచెదిరే గోల్‌తో ఇంగ్లండ్‌ను 2-1తో గెలిపించాడు. క్లిష్టమైన కోణం నుంచి అతడు కొట్టిన బంతి.. కీపర్‌ను బోల్తా కొట్టిస్తూ నేరుగా గోల్‌లో పడింది. కేన్ సేన విజయంపై ఇంగ్లండ్ రాజు కింగ్ చార్లెస్ అభినందనలు తెలిపారు. గత టోర్నీలో ఫైనల్లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది.