మనికా రికార్డు
ABN , Publish Date - Jul 31 , 2024 | 06:50 AM
ఒలింపిక్స్ టేబుల్ టెన్ని్‌సలో ప్రీక్వార్టర్స్ చేరుకొన్న తొలి భారత ప్లేయర్‌గా మనికా బాత్రా చరిత్ర సృష్టించింది. రౌండ్-32లో బాత్రా 4-0తో 18వ ర్యాంకర్ ప్రీతిక పవాడే (ఫ్రాన్స్)ను ఓడించింది.
ఒలింపిక్స్ టేబుల్ టెన్ని్‌సలో ప్రీక్వార్టర్స్ చేరుకొన్న తొలి భారత ప్లేయర్‌గా మనికా బాత్రా చరిత్ర సృష్టించింది. రౌండ్-32లో బాత్రా 4-0తో 18వ ర్యాంకర్ ప్రీతిక పవాడే (ఫ్రాన్స్)ను ఓడించింది. ఆరంభం నుంచే దూకుడైన ఆటను ప్రదర్శించిన 28వ ర్యాంకర్ మనికా 11-9, 11-6, 11-9, 11-7తో మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. కాగా, ఈ మ్యాచ్‌లో ఓడిన 19 ఏళ్ల ప్రీతిక తల్లిదండ్రులది పాండిచ్చేరి.
బల్‌రాజ్‌కు నిరాశ
రోయింగ్ సింగిల్ స్కల్స్‌లో బల్‌రాజ్ పన్వర్ పతక అవకాశాన్ని చేజార్చుకొన్నాడు. క్వార్టర్‌ఫైనల్స్ హీట్స్-4లో పన్వర్ 7 నిమిషాల 5.10 సెకన్లతో రేస్‌ను ముగించి నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన వారికే మెడల్ రౌండ్‌కు అర్హత లభిస్తుంది. దీంతో సెమీఫైనల్స్ సి/డి కేటగిరీకి పడిపోయిన పన్వర్ 13 నుంచి 24 స్థానాల కోసం పోడీపడనున్నాడు.
పంగల్ అవుట్
ఒలింపిక్స్‌లో భారత బాక్సర్ అమిత్ పంగల్ కథ ముగిసింది. 51 కిలోల ప్రీ క్వార్టర్స్‌లో పంగల్ 1-4తో ప్యాట్రిక్ చిన్‌యంబా (జాంబియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల 57 కిలోల రౌండ్-32లో జాస్మిన్ 0-5తో సెస్తీ పెటక్లో (ఫిలిప్సీన్స్) చేతిలో ఓడింది.