Zaheer Khan: జహీర్ ఖాన్‌కు కీలక బాధ్యతలు.. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్‌గా నియామకం..!
ABN , Publish Date - Aug 28 , 2024 | 08:15 PM
టీమిండియా మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ చాలా రోజుల తర్వాత మళ్లీ తెర పైకి రాబోతున్నాడు. కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న జహీర్ ఖాన్ మళ్లీ ఐపీఎల్ లోకి రాబోతున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. ఈ మేరకు లఖ్‌నవూ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
టీమిండియా మాజీ స్టార్ బౌలర్ జహీర్ ఖాన్ (Zaheer Khan) చాలా రోజుల తర్వాత మళ్లీ తెర పైకి రాబోతున్నాడు. కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్న జహీర్ ఖాన్ మళ్లీ ఐపీఎల్ (IPL) లోకి రాబోతున్నాడు. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) మెంటార్‌గా బాధ్యతలు నిర్వహించబోతున్నాడు. ఈ మేరకు లఖ్‌నవూ ఫ్రాంఛైజీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వచ్చే సీజన్ ఐపీఎల్ నుంచి జహీర్ ఎల్‌ఎస్‌జీ మెంటార్ (LSG Mentor)గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఎల్‌ఎస్‌జీకి గౌతమ్ గంభీర్ 2022, 2023 సీజన్లలో మెంటార్‌గా వ్యవహరించాడు. ఆ రెండు సీజన్లలోనూ ఎల్‌ఎస్‌జీ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది.
2024 సీజన్‌కు గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా వెళ్లిపోయాడు. దీంతో ఎల్‌ఎస్‌జీ ఈ ఏడాది ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన చేసింది. దీంతో అనుభవజ్ఞుడైన ఆటగాడిని మెంటార్‌గా నియమించుకునేందుకు ఎల్‌ఎస్‌జీ ప్రయత్నాలు చేసింది. పైగా ఈ ఏడాది వరకు ఎల్‌ఎస్‌జీ బౌలింగ్ కోచ్‌గా ఉన్న మోర్నీ మోర్కెల్ కూడా ఎల్‌ఎస్‌జీకి దూరమయ్యాడు. గంభీర్ కోరిక మేరకు అతడు భారత జట్టు బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. దీంతో మెంటార్ పాత్రకు జహీర్ ఖాన్ సరిపోతాడని ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్ భావించింది. అతడితో సంప్రదింపులు జరిపింది.
టీమిండియా తరఫున ఆడిన అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో జహీర్ ఖాన్ ఒకడు. టీమిండియా 2011 ప్రపంచకప్ గెలవడం వెనుక జహీర్ పాత్ర ఎంతో ఉంది. 2017లో జహీర్ ఖాన్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2018 నుంచి 2022 వరకు ముంబై ఇండియన్స్ సహాయక బృందంలో పని చేశాడు. 2023, 24 సీజన్లలో ఐపీఎల్‌కు పూర్తిగా దూరమయ్యాడు. అతడిని ఎల్‌ఎస్‌జీ తిరిగి ఐపీఎల్‌లోకి తీసుకొస్తోంది.
ఇవి కూడా చదవండి..
KL Rahul: లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకాను కలిసినా రాహుల్.. ఎల్‌ఎస్‌జీతో ఉండే విషయంలో నో క్లారిటీ!
బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ?
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..