Scientists: మానవ చర్మంతో రోబోకు మనిషి ముఖం.. జపాన్ శాస్త్రవేత్తల అరుదైన ఘనత
ABN , Publish Date - Jun 26 , 2024 | 01:35 PM
జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు. టోక్యో యూనివర్శిటీకి చెందిన ఈ బృందం సజీవ చర్మ కణజాలాన్ని ల్యాబ్‌లో అనేక పరీక్షలు చేసి తయారు చేసింది.
అయితే దీన్ని సులభంగా చీల్చలేరని, అంత పటిష్టంగా దీన్ని తయారు చేశామని టోక్యో బృందం వివరించింది. అధ్యయన ఫలితాలు సెల్ రిపోర్ట్స్ ఫిజికల్ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ముఖాలను ముట్టుకుంటే నిజమైన చర్మంలాగే అనిపిస్తుంది. వీటికి ఏదైనా డ్యామేజ్ జరిగితే వాటికవే రిపేర్ చేసుకోగలవు. కొల్లాజెన్, ఎలాస్టేన్ పదార్థాలను వీటి తయారీలో ఉపయోగించారు.
తొలుత రోబోట్‌కి చిన్న రంధ్రాలు చేసి, చర్మపు పొరను అటాచ్ చేసే ముందు కొల్లాజెన్‌తో కూడిన జెల్‌ను పూశారు.ఈ జెల్ రోబోట్ కదులుతున్నప్పుడు చర్మం విరిగిపోకుండా చూస్తుంది. రోబో నుంచి చర్మం విడిపోకుండా ముఖాలను డిజైన్ చేసినట్లు ప్రధాన పరిశోధకుడు ప్రొఫెసర్ షోజీ టేకుచి తెలిపారు.
అయితే వీటిని వాణిజ్యగా ఉపయోగించేముందు చాలా సంవత్సరాలు పరీక్షించాల్సి ఉంటుందని శాస్త్రవేత్తల బృందం తెలిపింది. ప్లాస్టిక్ సర్జరీ, చర్మ వృద్ధాప్యం, సౌందర్య సాధనాలు, శస్త్రచికిత్స విధానాలపై పరిశోధనలో కూడా తాజా రిసర్చ్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
For Latest News and National News click here..