Share News

నేతలకు కలిసొచ్చిన 2019 ఎన్నికలు

ABN , Publish Date - Apr 27 , 2024 | 06:28 AM

2019 పార్లమెంటు ఎన్నికలు.. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్‌, బీజేపీలోని కొందరు నేతలకు బాగా కలిసివచ్చాయి. 2018 ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన ప్రముఖ నేతలు..

నేతలకు కలిసొచ్చిన 2019 ఎన్నికలు

ఆ వెంటనే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి ఎంపీలుగా గెలుపొందారు. కాంగ్రెస్‌ తరఫున గెలుపొందిన వారిలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2018లో అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. దీంతో ఆ వెంటనే 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక రేవంత్‌రెడ్డి.. కొడంగల్‌ నుంచి వరుసగా మూడోసారి గెలిచేందు


కు చేసిన ప్రయత్నం విఫలమై 2018లో ఓడిపోయారు. కానీ, ఆ వెంటనే మల్కాజిగిరి పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఈ గెలుపు ఆయనకు రాజకీయంగా బాగా కలిసివచ్చింది. ఎంపీగా ఢిల్లీకి వెళ్లడం వల్ల కాంగ్రెస్‌ అధిష్ఠానంతో రేవంత్‌కు సాన్నిహిత్యం పెరిగింది. అది ఆయనకు టీపీసీసీ అధ్యక్ష పదవిని, ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కేలా చేసింది. ఇక బీజేపీ నేత కిషన్‌రెడ్డి కూడా 2018లో అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయు.. 2019లో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా గెలుపొందారు.

తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన ఎంపీల్లో సీనియర్‌ కావడంతో కిషన్‌రెడ్డిని కేంద్ర మంత్రి పదవి వరించింది. ఇక బండి సంజయ్‌ కరీంనగర్‌ ఎంపీగా ఎన్నికయ్యాక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయ్యారు. కాగా, కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 2018 ఎన్నికల్లో హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. తిరిగి నల్లగొండ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 07:46 AM