బాలికలు స్వీయ రక్షణ పాటించాలి
ABN , Publish Date - Dec 05 , 2024 | 10:59 PM
బాలికలందరు స్వీయ రక్షణ పాటిస్తూ జాగ్రత్తగా మెలగాలని వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి సూచించారు. మంచిర్యాలకు చెందిన భరోసా సహాయక కేంద్రం ఆధ్వర్యంలో వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం బాలికలకు అవగాహన కల్పించారు.

దండేపల్లి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి):బాలికలందరు స్వీయ రక్షణ పాటిస్తూ జాగ్రత్తగా మెలగాలని వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి సూచించారు. మంచిర్యాలకు చెందిన భరోసా సహాయక కేంద్రం ఆధ్వర్యంలో వెల్గనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం బాలికలకు అవగాహన కల్పించారు.
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పెద్దవాళ్లతో ఎలా మెలగాలి అనే అం శాలపై వివరించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ సమాజ పరిస్థితులు గమనిస్తూ సెల్‌ఫోన్‌లకు దూరంగా ఉంటూ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. మీకు మీరే రక్షణ పద్ధతులు పాటించాలన్నారు. భరోసా కేంద్రం సభ్యులు ప్రమీల, పద్మావతి, పుష్పలత, ఉపాద్యాయులు రజినీ, పద్మావతి, రమాదేవి పాల్గొన్నారు.