ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి
ABN , Publish Date - Dec 16 , 2024 | 10:17 PM
దరఖాస్తుదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణతో కలిసి పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. 1993లో బెల్లంపల్లిలో నిర్మించుకున్న టీడీపీ కార్యాలయాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు మణిరామ్‌సింగ్ ఫిర్యాదు చేశారు.

మంచిర్యాల కలెక్టరేట్, డిసెంబర్ 16(ఆంధ్రజ్యోతి) : దరఖాస్తుదారుల సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవోలు శ్రీనివాస్‌రావు, హరికృష్ణతో కలిసి పలువురి నుంచి అర్జీలు స్వీకరించారు. 1993లో బెల్లంపల్లిలో నిర్మించుకున్న టీడీపీ కార్యాలయాన్ని కొందరు ఆక్రమించుకున్నారని ఆ పార్టీ పట్టణాధ్యక్షుడు మణిరామ్‌సింగ్ ఫిర్యాదు చేశారు.
తాను పక్షవాతంతో బాధపడుతున్నానని, కుటుంబ పోషణ కష్టంగా ఉందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని నస్పూర్ మండలం శ్రీరాంపూర్ చెందిన బొద్దుల రాజయ్య అర్జీ ఇచ్చాడు. కోటపల్లి మండలంలోని పారుపల్లి-లింగన్నపేట గ్రామాల మధ్య నిర్మించిన వంతెనకు ఇరువైపులా ఉన్న హైటెన్షన్ విద్యుత్ తీగల కారణంగా ప్రయాణికులకు బస్సు సౌకర్యం లేకపోవడంతో పాటు పత్తి, ధాన్యం, గడ్డి తరలించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తీగలను తొలగించాలని కోటపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మంత్రి రామయ్య వినతిపత్రం అందించారు. దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ కుమార్‌దీపక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.