Share News

Minister Seetakka: ఆదిలాబాద్ జిల్లాలో సీతక్క పర్యటన నేడు

ABN , Publish Date - Jan 23 , 2024 | 08:08 AM

ఆదిలాబాద్: మంత్రి సీతక్క మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కెరమెరి మండలం, గొందిలో జంగు బాయిని మంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం అభివృద్ధి పనులపై ఉట్నూర్ కేబి కాంప్లెక్స్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష చేయనున్నారు.

Minister Seetakka: ఆదిలాబాద్ జిల్లాలో సీతక్క పర్యటన నేడు

ఆదిలాబాద్: మంత్రి సీతక్క మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. కెరమెరి మండలం, గొందిలో జంగు బాయిని మంత్రి దర్శించుకోనున్నారు. అనంతరం అభివృద్ధి పనులపై ఉట్నూర్ కేబి కాంప్లెక్స్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్ష చేయనున్నారు. జిల్లా అధికారులు ఆయా శాఖల సంక్షిప్త నివేదికలతో రావాల్సిందిగా మంత్రి సూచించారు. ఈ సమావేశానికి హాజరు కావాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

కాగా ప్రజావాణి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పీఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ భవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయన దరఖాస్తులను స్వీకరించారు. భూ సంబంధ, ఆసరా, రెండు పడకల గదుల ఇండ్లు, తదితర సమస్యలపై వచ్చిన దరఖాస్తులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Jan 23 , 2024 | 08:08 AM