TS News: కామారెడ్డి డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు
ABN , Publish Date - May 15 , 2024 | 01:43 PM
ఉన్నత స్థానంలో ఉండి.. మహిళల పట్ల గౌరవంతో నడుచుకోవాల్సిన ఆఫీసరే లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాజాగా కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఎవరా ఆఫీసర్ అంటారా? కామారెడ్డి డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు, వేధింపుల ఘటనపై డీఎంహెవ్ పై ఉన్నతాధికారులు ఫైర్ అయ్యారు.
కామారెడ్డి: ఉన్నత స్థానంలో ఉండి.. మహిళల పట్ల గౌరవంతో నడుచుకోవాల్సిన ఆఫీసరే లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తాజాగా కొందరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఎవరా ఆఫీసర్ అంటారా? కామారెడ్డి డీఎంహెచ్ఓ లక్ష్మణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వైద్య శాఖ అధికారులు విచారణ చేపట్టారు. వివాదాస్పద వ్యాఖ్యలు, వేధింపుల ఘటనపై డీఎంహెవ్ పై ఉన్నతాధికారులు ఫైర్ అయ్యారు. లైంగిక వేధింపుల ఘటనపై డైరక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ఫ్యామిలీ అడిషనల్ డైరక్టర్ అమర్ సింగ్ నాయక్ ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగింది. తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారని 10 మందికి పైగా మహిళా మెడికల్ ఆఫీసర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌లో భారీ మెజారిటీపై ‘మజ్లిస్’ ధీమా...
Read Latest Telangana News and National News