Hyderabad: ఆరు దాటితే చాలు.. ఆకతాయిల హల్‌చల్..
ABN , Publish Date - Mar 22 , 2025 | 10:15 AM
ఆరు దాటితే చాలు.. ఆ ఏరియాలో ఆకతాయిలు హల్‌చల్ చేస్తుంటారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకున్న పాపం లేదు. కాసేపు థీమ్ పార్కులో సేద తీరుదామనుకునే అక్కడి ప్రజలకు అక్కడ నెలకొన్న పరిస్థితితో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

- పార్కులో మద్యం ప్రియులు, పోకిరీల తిష్ట
- ఆహ్లాదం కోసం వస్తే భద్రత కరువు
- మల్లాపూర్‌లోని థీమ్ పార్కులో పరిస్థితి ఇదీ
హైదరాబాద్: దంచికొడుతున్న ఎండలు... పిల్లలకు ఒంటిపూట బడులు.. ఈ నేపథ్యంలో సాయంత్రం కొద్దిసేపు సేద తీరేందుకు ఉద్యానవనానికి వస్తే అక్కడ ఆకతాయిలు, మందుబాబుల తీరుతో ఆహ్లాదం కాస్త ఆవిరైపోతోంది. మల్లాపూర్ కలర్స్ థీమ్ పార్కు(Mallapur Colors Theme Park)ను 3 కోట్ల రూపాయలతో మూడేళ్లకు పైగా కష్టపడి నిర్మించారు. పార్కును సుం దరంగా తీర్చిదిద్దిడంతో పలు కుటుంబాలు సా యం త్రం సమయంలో అక్కడ గడిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, ఇటీవల కాలంలో సాయంత్రం 6 గంటలు దాటితే చాలు పార్కులోకి ఆకతాయిల సంచారం మొదలవుతోంది. దీనికి తోడు పార్కులో తరచూ ఖాళీ మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు కనిపిస్తుడంటంతో ఇక్కడి భద్రతపై సందర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Rain: నగరంలో.. వడగళ్ల వాన
పట్టించుకోని పోలీసులు
మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్‌లో కలర్స్ థీమ్ పార్కు ప్రారంభించిన కొద్ది రోజులకే ఉదయం, సాయంత్రం వేళల్లో ఇక్కడ వాకింగ్ చేసేందుకు జనం రావడం మొదలైంది. అలాగే, పిల్లలతో పార్కులో గడిపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ పార్కుకు ఒకవైపు వైకుంఠ ధామం, మరోవైపు డంపింగ్ యార్డు ఉంది. పార్కు ప్రహరీ ఎత్తు లేకపోవడంతో ఆకతాయిలు గోడ దూకి లోపలికి వచ్చి ఇతరులకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. ఇటీవల కొందరు యువకులు మద్యం, గంజాయి తాగుతూ ఘర్షణ పడ్డారు. స్థానికులు ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పార్కు వద్ద గస్తీ పెంచాల్సిన పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని పలువురు ఆరోపిస్తున్నారు.
వాచ్‌మెన్‌కు బెదిరింపులు..
ఇటీవల రాత్రి పది గంటల తర్వాత కొందరు పోకిరీలు పార్కులోకి చొరబడ్డారు. వాచ్‌మెన్ అడ్డుకోవడంతో బెదింపులకు పాల్పడ్డారు.ఇప్పటికైనా నాచారం పోలీసులు పార్కుకు రెండు వైపులా గస్తీ పెంచడంతో పాటు రాత్రి వేళల్లో పార్కులోకి పెట్రోలింగ్ సిబ్బంది వచ్చి వెళ్లేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ చార్జీలు పెంచడం లేదు
మామునూరు ఎయిర్ పోర్టుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం
ఆ క్రెడిట్ వారు తీసుకున్నా ఏం కాదు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్
పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు
Read Latest Telangana News and National News