ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: రుణమాఫీకి విధివిధానాలు!

ABN, Publish Date - Jun 11 , 2024 | 03:00 AM

రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

  • రూపొందించాలంటూ అధికారులకు సీఎం ఆదేశం

  • ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేసి తీరాల్సిందే

  • బ్యాంకుల నుంచి రైతుల వివరాలు సేకరించండి

  • నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు పంపండి

  • వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): రైతులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో అన్నారు. ఇందుకు సంబంధించి వెంటనే విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. పంట రుణమాఫీ, ఇతర అంశాలపై వ్యవసాయ, సహకార శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. రైతు రుణమాఫీ పథకం అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రూ.2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని, పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు ేసకరించి అర్హులను గుర్తించాలని సూచించారు. కటాఫ్‌ తేదీ విషయంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేవలం బ్యాంకుల నుంచే కాకుండా, పీఏసీఎ్‌సల నుంచి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలను కూడా అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసేందుకు పూర్తిస్థాయి వివరాలతోపాటు అవసరమైన అంచనా వ్యయాన్ని కూడా రూపొందించాలని, స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆదేశించారు.


రుణమాఫీకి ఎన్ని నిధులు అవసరమవుతున్నాయో చూసుకొని ఆదాయ మార్గాలను అన్వేషించాలన్నారు. మూడు, నాలుగు రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని, కేబినెట్‌ ముందు పెట్టి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రామకృష్ణారావు, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్‌ గోపి ఇతర అధికారులు పాల్గొన్నారు


నిధులు, పథకాల సాధనకు కృషి చేయాలి

  • తెలుగు రాష్ట్రాల కేంద్రమంత్రులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌

ఏపీ, తెలంగాణల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, శ్రీనివాస వర్మలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాలని కోరారు. ఈమేరకు ఆయన సోమవారం తన ‘ఎక్స్‌’ ఖాతాలో ట్వీట్‌ చేశారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 03:00 AM

Advertising
Advertising